కోలారు: సమాజంలో ప్రజలకు నైతిక విలువల పట్ల అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని నివృత్త హైకోర్టు న్యాయమూర్తి హెచ్ ఎన్ నాగమోహనదాస్ తెలిపారు. ఆదివారం నగరంలోని ప్రైవేటు కళ్యాణ మంటపంలో ఆల్ బ్యాంక్ వెల్ఫేర్ సొసైటీ 10 వార్షికోత్సవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో నైతికత గురించి అవగాహన కలిగించే ప్రయత్నాలు జరగాలన్నారు. ప్రపంచంలోఏఏ దేశాల మధ్య యుద జరిగినా అది అన్ని దేశాలల్లోని సామాన్య ప్రజలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో కెనెరా బ్యాంకు నివృత్త అధికారి వి శివశంకర శాస్త్రి, గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ నాయకుడు రాజరెడ్డి, సంఘం అధ్యక్షుడు హెచ్ బసవరాజ్, తదితరులు పాల్గొన్నారు.


