దివాలాకోరు.. అప్పుల బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

దివాలాకోరు.. అప్పుల బడ్జెట్‌

Mar 13 2026 7:46 AM | Updated on Mar 13 2026 7:46 AM

శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ప్రజలను నిరాశపరిచింది. బడ్జెట్‌లో ముఖ్యమంత్రి సిద్ధరాయ్య దివాలాతనాన్ని ప్రదర్శించారు అని గురువారం విధానసభలో బీజేపీ ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర ఆరోపించారు. బడ్జెట్‌ చర్చలో పాల్గొని మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కేంద్రం మీద ఆరోపణలు చేస్తోందన్నారు. ఆదాయ సేకరణలో ప్రభుత్వం విఫలమైంది, విచ్చలవిడిగా అప్పులు చేసిన ఘనతను తెచ్చుకుంది, కేంద్రం వల్ల రాష్ట్రానికి అన్యాయమవుతోందని పదే పదే చెబుతూ, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి 100 రూపాయలు పన్నులు వెళ్తే తిరిగి 15 రూపాయలే ఇస్తోందనడం సరికాదన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా అదే మాదిని కేంద్రం నిధులు ఇస్తోందన్నారు.

విధానసభలో బీజేపీ ఎమ్మెల్యే విజయేంద్ర ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement