ప్రియుని మోజు.. పెళ్లయిన 2 నెలలకే హత్య | - | Sakshi
Sakshi News home page

ప్రియుని మోజు.. పెళ్లయిన 2 నెలలకే హత్య

Mar 12 2026 7:43 AM | Updated on Mar 12 2026 7:43 AM

తుమకూరు: తిపటూరు తాలూకా రంగాపుర సమీపంలోని చిక్కకొట్టేగెహళ్లి వద్ద తిపటూరు గాంధీనగర నివాసి, గుజరీ వ్యాపారి మన్సూర్‌ పాషా (31) హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అజ్జంపూరు తాలూకాకు చెందిన ధనరాజ్‌ హెచ్‌టీ (24), వెంకటేశ్‌ (24), దర్శన్‌ (24), మృతుని భార్య ఫర్జానా అరెస్టయిన నిందితులు. బుధవారం జిల్లా ఎస్పీ అశోక్‌ కేసు వివరాలను వెల్లడించారు. 2 నెలల కిందటే మన్సూర్‌ పాషా, ఫర్జానా పెళ్లయింది. కానీ ఫర్జానాతో ధనరాజ్‌కు గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. పెళ్లి తర్వాత కూడా తరచూ కలిసేవారు. తమకు అడ్డుగా ఉన్న మన్సూర్‌ పాషాను వ్యాపారం గురించి మాట్లాడాలని పిలుచుకెళ్లి హత్య చేశారు. హత్యకు ఉపయోగించిన వస్తువులు, బొలేరో వాహనం, పల్సర్‌ బైక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement