దశ తిరిగేలా.. విజయోస్తు | - | Sakshi
Sakshi News home page

దశ తిరిగేలా.. విజయోస్తు

Mar 19 2026 8:24 AM | Updated on Mar 19 2026 8:24 AM

శివాజీనగర: విద్యార్థి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్‌) వార్షిక పరీక్షలు బుధవారం రాష్ట్రమంతటా ప్రారంభమయ్యాయి. 8,65,988 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు పరీక్ష జరిగింది. 2,870 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పరీక్షల్లో అక్రమాలు జరగకుండా అన్ని విధాలా భద్రతా చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి నెలకొంది. కేంద్రాలకు పిల్లలతో పాటు తల్లిదండ్రులూ తరలివచ్చారు. గాభరా పడవద్దని, పరీక్షలు బాగా రాయాలని తల్లులు పిల్లలకు ధైర్యం నూరిపోశారు. కొందరు దిష్టి తీసి విజయోస్తు అని దీవించారు.

మంత్రి మధు బంగారప్ప తనిఖీ

మల్లేశ్వరం ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షా కేంద్రాన్ని విద్యా మంత్రి మధు బంగారప్ప సందర్శించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సక్రమంగా పరీక్షలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

రాష్ట్రంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ

పరీక్షలు షురూ

పరీక్షా కేంద్రాల్లో సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement