బళ్లారి, విజయనగరలకు కొత్త బస్సులు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

బళ్లారి, విజయనగరలకు కొత్త బస్సులు ఇవ్వండి

Mar 19 2026 8:25 AM | Updated on Mar 19 2026 8:25 AM

సాక్షి బళ్లారి: బళ్లారి, విజయనగర జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 100 ఎర్ర బస్సులు, 20 ఏసీ బస్సులు కేటాయించాలని ఎమ్మెల్సీ వైఎం.సతీష్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విధాన పరిషత్‌లో ఆయన ఉమ్మడి బళ్లారి జిల్లా సమస్యలపై గళం విప్పారు. పాత బస్సులను నడపడం వల్ల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అందువల్ల నూతన బస్సులను మంజూరు చేయాలని ఒత్తిడి చేశారు. ఎమ్మెల్సీ ప్రశ్నకు మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ కళ్యాణ కర్ణాటక ప్రాంతానికి 2026వ సంవత్సరానికి సంబంధించి నూతన బస్సుల కొనుగోలుకు టెండర్‌ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు 400 బస్సులు కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకొన్నామన్నారు. విద్యార్థులు కూడా బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా పాత బస్సులను పక్కన పెట్టి సత్వరం కొత్త బస్సులను మంజూరు చేయాలన్నారు.

ప్రభుత్వానికి ఎమ్మెల్సీ వైఎం.సతీష్‌ వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement