ప్రేమపెళ్లి జంటల భద్రతకు భరోసా | - | Sakshi
Sakshi News home page

ప్రేమపెళ్లి జంటల భద్రతకు భరోసా

Mar 19 2026 8:25 AM | Updated on Mar 19 2026 8:25 AM

శివాజీనగర: రాష్ట్రంలో కులాంతర, మతాంతర ప్రేమపెళ్లి చేసుకునే జంటలపై తల్లిదండ్రులు, బంధువులు దాడులకు పాల్పడడం పెరిగింది. ఇలాంటి పరువు హత్యలు, దాడులు, బెదరింపులకు పాల్పడేవారికి జైలు శిక్ష, జరిమానా విధించేలా ఇవ నమ్మవ, ఇవ నమ్మవ అనే బిల్లును బుధవారం విధానసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే బిల్లు గురించి వివరించారు. దాడులకు పాల్పడేవారికి కనీసం ఐదేళ్లు జైలు శిక్ష పడేలా నిబంధనలు ఉంటాయన్నారు. దంపతుల్లో ఎవరినైనా తీవ్ర గాయపరిస్తే వారికి 3 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష, రూ.3 లక్షల వరకు జరిమానాను విధించవచ్చన్నారు. చిన్న గాయమైనా 2 సంవత్సరాలకు తక్కువ కాకుండా జైలు, రూ.2 లక్షల జరిమానా తప్పదని తెలిపారు. దంపతులను బెదిరించినవారికి 3 నుంచి ఐదేళ్ల లోపు జైలుశిక్ష, రూ.2 లక్షలు జరిమానా విధించేలా చట్టం ఉంటుందన్నారు. కులం పేరుతో అధికారం చలాయించేవారిని అదుపు చేయడమే చట్టం లక్ష్యమన్నారు.

డీజేలపై నిషేధం యోచన

యశవంతపుర: వేడుకలు, జాతరలు, పెళ్లి ఊరేగింపులు.. ఇలా ఏ సంబరమైనా ఇప్పుడు డీజేల వాడకం పెరిగింది. భారీ స్పీకర్లతో గుండెలదిరేలా మ్యూజిక్‌ను పెట్టి చిందులేస్తారు. ఈ డీజేలను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. శివమొగ్గ జిల్లా జీజేపీ ఎమ్మెల్యే ఎస్‌ఎన్‌ చన్నబసప్ప సహ్యాద్రి ఉత్సవాల నిర్వహణకు అనుమతివ్వాలని విధానసభలో ప్రస్తావించారు. గంగావతి బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి కొప్పళ ఆనెగుంది ఉత్సవాలను పునః ప్రారంభించాలని కోరారు. ఈ సమయంలో కార్మికశాఖ మంత్రి సంతోష్‌లాడ్‌ ఏ ఉత్సవం జరిగినా డీజేలతో పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. త్వరలో డీజేలను నిషేధించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం సభ్యులకు ఒక ప్రకటనను విడుదల చేసింది.

పరువు పేరుతో దాడులు చేస్తే కఠిన శిక్షలు

అసెంబ్లీలో సర్కారు బిల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement