బనశంకరి: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలోని 5 నగర పాలికెలలో మొత్తం 88,92,528 మంది ఓటర్లు ఉన్నారని జీబీఏ కమిషనర్ మహేశ్వరరావ్ తెలిపారు. సోమవారం జీబీఏ కేంద్ర ఆఫీసులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగళూరు కేంద్ర, ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ నగర పాలికెలలో మొత్తం 369 వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో 45,69,752 మంది పురుషులు, 43,31,143 మంది మహిళా ఓటర్లు, ఇతర ఓటర్లు 1,635 మంది ఉన్నారని చెప్పారు.
51వ వార్డులో అత్యధికం
గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 8,024 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు దక్షిణ నగర పాలికెలో 51వ వార్డు (సుబ్రమణ్య నగర)లో అత్యధికంగా 54,026 ఓటర్లు ఉన్నారు. తూర్పు పాలికేలో 16 వార్డు (కొత్తూరు)లో అతి తక్కువగా 10,940 మంది ఓటర్లే ఉన్నారని తెలిపారు.
ఏప్రిల్‌లో తుది జాబితా
జాబితాలలో పేరు లేనివారు, వేరే వార్డులో ఓటు నమోదైనవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. దరఖాస్తుల పరిష్కారం తరువాత ఏప్రిల్ 6వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. ప్రజలు చూసుకోవడానికి వార్డుల వారీగా ఓటర్ల జాబితాను జీబీఏ వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ రూపంలో ప్రకటిస్తామన్నారు. అలాగే ఒక్కో పాలికెలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
పురుష ఓటర్లే అధికం
జాబితా విడుదల


