మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత

Mar 17 2026 7:48 AM | Updated on Mar 17 2026 7:48 AM

రాయచూరు రూరల్‌ : నగరంలో 20 చోట్ల కొత్తగా రూ.2.50 కోట్లతో మరుగుదొడ్లను నిర్మిస్తున్నట్లు సిటీ కార్పొరేషన్‌ కమిషనర్‌ జుబిన్‌ మహాపాత్రో వెల్లడించారు. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో 2026–27వ బడ్జెట్‌ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మహాత్మాగాంధీ మిషన్‌ కింద రూ.200 కోట్లతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిందన్నారు. కార్పొరేటర్లు మహావీర్‌, వెంకటేష్‌, భాస్కర్‌, కార్పొరేషన్‌ అధికారులు శరణప్ప, సంతోష్‌, భరత్‌, సంతోష్‌రాణి, కృష్ణ శావంతగేరలున్నారు.

పాత్రికేయులకు నిధులు కేటాయించాలి

నగర పరిధిలో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులకు సిటీ కార్పొరేషన్‌ నుంచి 2026–27వ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రాయచూరు రిపోర్టర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడు విజయ్‌ జాగటగల్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం సిటీ కార్పొరేషన్‌ కార్యాలయంలో కమిషనర్‌ జుబిన్‌ మహాపాత్రోకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు.

రేపు వాక్‌థాన్‌

బళ్లారిఅర్బన్‌: మానవ అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 18న వాక్‌థాన్‌ నిర్వహిస్తున్నట్లు తారనాథ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ గాణిగేర్‌ తెలిపారు. సోమవారం పత్రికా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోజు ఉదయం 7.30 గంటలకు బళ్లారి మెడికల్‌ కళాశాల మైదానంలో కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ వాక్‌థాన్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వైద్య కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొంటారన్నారు.

గ్రంథాలయం ప్రారంభించరూ

రాయచూరు రూరల్‌: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో తిరిగి గ్రంథాలయం ప్రారంభించాలని సీపీఐ(ఎంఎల్‌) డిమాండ్‌ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు నాగరాజ్‌ మాట్లాడారు. అనంతరంఏడీసీ శివానందకు వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement