కోలారు: కాంగ్రెస్ పార్టీలోని నాయకులు బేధాభిప్రాయాలను పక్కన బెట్టి ముళబాగిలు నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయడానికి కృషి చేయాలని ఆవణి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వి.ఆదినారాయణ తెలిపారు. ఆదివారం నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో దీర్ఘసుమంగళీభవ కార్యక్రమం నిర్వహణపై పూర్వ సిద్ధతా సమావేశం నిర్వహించారు. ముళబాగిలు తాలూకాలో ప్రతి గ్రామం నుంచి 20 వేల మందికి వడిబాలు పెట్టే కార్యక్రమాన్ని త్వరలో నిర్వహిస్తామన్నారు. మహిళలను తీసుకొచ్చే బాధ్యత పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు. కోలారు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మెల్సీ ఎం.ఎల్.అనిల్ కుమార్, తదితరుల మార్గదర్శనం మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖ మండలి మాజీ ఉపాధ్యక్షుడు జి.రామలింగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలంగూరు శివణ్ణ, టౌన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమానుల్లా, పీఎల్‌డీ బ్యాంక్ డైరెక్టర్ రాజేంద్ర గౌడ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల
హోసూరు: కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. తమిళనాడులో ఏప్రిల్ 23వ తేదీ శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు నామినేషన్లను మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు సమర్పించవచ్చు. ఏప్రిల్ 23న ఎన్నికలు, మే 4వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.


