కోలారు: ముళబాగిలు తాలూకా టీఏపీఏసీఎంఎస్ నూతన అధ్యక్షుడిగా రెండవ సారి ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఉపాధ్యక్షురాలిగా సుధా తిమ్మరాజు ఎన్నికయ్యారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు వీరిద్దరు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి అమిద్ హుసేన్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్తూరు మంజునాథ్ మాట్లాడుతూ.. పార్టీ నాయకుల ఒత్తిడి కారణంగా తాను అధ్యక్ష స్థానానికి రెండవ సారి పోటీ చేశానని తెలిపారు. తాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి ముళబాగిలు ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్ సంపూర్ణ సహకారం అందించారని కొనియాడారు. ఏడాదిలోగా సొసైటీకి నూతన హైటెక్ కట్టడాన్ని నిర్మించడం జరుగుతుందని తెలిపారు. నూతన కట్టడానికి కేంద్ర మాజీ మంత్రి ఎం.వి.కృష్ణప్ప పేరు పెడుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆవణి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వి.ఆదినారాయణ, కేపీసీసీ సభ్యుడు జి.రామలింగారెడ్డి, ఉత్తనూరు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


