విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు: వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు: వ్యక్తి మృతి

Mar 16 2026 7:24 AM | Updated on Mar 16 2026 7:24 AM

శ్రీనివాసపురం: విద్యుత్‌ స్తంభాన్ని కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మరణించిన ఘటన తాలూకాలోని బద్దిపల్లి క్రాస్‌ వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. శ్రీనివాసపురం తాలూకా గుడిపల్లి గ్రామానికి చెందిన లోకేష్‌ (45) ప్రమాదంలో మరణించిన వ్యక్తి. వృత్తిరీత్యా పురోహితుడు అయిన లోకేష్‌ పూజా కార్యక్రమాలను ముగించుకుని తిరిగి స్వగ్రామం గుడిపల్లికి బయలుదేరాడు. బద్దిపల్లి క్రాస్‌ వద్ద కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. ఘటనలో లోకేష్‌ అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న గౌనిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement