బెంగళూరులోని వ్యాలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం చేసిన విచిత్ర ప్రయత్నం స్థానికులను, పోలీసులను షాక్‌కు గురి చేసింది. ఒక మహిళ, ఆమె భర్త, అత్త, మరిది కలిసి పెద్ద ప్యాకేజీని కొరియర్ సర్వీస్ ఆఫీసుకు తీసుకెళ్లారు.
పార్శిల్ తరలించే ముందు దాని బరువు ఎంత ఉంది? అందులో ఏమున్నాయి? అని అడగడం సర్వసాధారణం. ఈ ఘటనలో కూడా పార్శిల్ సర్వీస్ కార్యాలయం ప్రతినిధులు ఇదే విధంగా ఆరా తీశారు. సిబ్బంది పార్శిల్ లోపల ఏముందో చెప్పాలని అడగ్గా కుటుంబ సభ్యులు సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు.
‘మేము కష్టపడి ఇంత దూరం వచ్చాం. ఈ పార్శిల్‌ను తాము చెప్పిన అడ్రస్‌కు పంపాలి’ అని పట్టుబడుతూ వాగ్వాదానికి దిగారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన సిబ్బంది ప్యాకేజీని తెరిచి చూడగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఇంటి యజమాని బయటకు వచ్చాడు.కంగుతిన్న సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
విచారణలో కుటుంబం చెప్పిన వివరణ మరింత ఆశ్చర్యకరంగా మారింది. ఉగాది, రంజాన్ మాసంలో బస్సు, ట్రైన్ టికెట్లు దొరకకపోతే గమ్యస్థానానికి ఎలా వెళ్లాలో చూపించేందుకు ఇంటి యజమానిని తెల్లబస్తాలో పెట్టి పార్శిల్ కేంద్రానికి తీసుకువచ్చామని, ఇదంతా సోషల్ మీడియా రీల్స్ కోసం చేశామని తెలిపారు. తరువాత పోలీసులు కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరికి వారు క్షమాపణలు చెబుతూ, తాము చేసిన పని బాధ్యతారహితమని అంగీకరిస్తూ వీడియోను రికార్డు చేశారు.
పోలీసులు కుటుంబానికి కఠిన హెచ్చరిక జారీ చేసి, ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు మళ్లీ చేయవద్దని సూచించారు. చివరికి వారిని విడిచిపెట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. వినోదం కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి.
Daughter & family stuff father in gunny bag, take him to courier office to "send parcel" out of Bengaluru all for a reel showing it's easier to courier a man than book bus/train tickets this festive season. Now in police station.
Weird world. 😭
pic.twitter.com/gGEpKeeYjM— Ghar Ke Kalesh (@gharkekalesh) March 17, 2026


