తగ్గిన వంట గ్యాస్‌ సిలిండర్ల సరఫరా | - | Sakshi
Sakshi News home page

తగ్గిన వంట గ్యాస్‌ సిలిండర్ల సరఫరా

Mar 12 2026 7:17 AM | Updated on Mar 12 2026 7:17 AM

హొసపేటె: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో దేశీయంగా వంటగ్యాస్‌ సిలిండర్ల సరఫరాపై దుష్ప్రభావం పడింది. దీంతో నగరంలో వంట గ్యాస్‌ సిలిండర్ల సరఫరా ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. యుద్ధంతో సిలిండర్ల కొరత ఏర్పడటంతో గృహ వినియోగదారులు, హోటల్‌ పరిశ్రమలో ఆందోళనకు కారణమైంది. సాధారణంగా ప్రతి రోజూ రెండు నుంచి మూడు లోడ్ల గ్యాస్‌ సిలిండర్లు నగరానికి వస్తాయి. కానీ బుధవారం ఒక లోడ్‌ మాత్రమే రావడం గమనార్హం. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిపి వేయడం హోటల్‌, వ్యాపార రంగానికి ఇబ్బందులను కలిగించింది. దీనిపై నగరంలోని ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీ మేనేజర్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సరఫరా సమస్య నెలకొందన్నారు. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయన్నారు. బుధవారం 360 సిలిండర్లు మాత్రమే రాగా నగరంలో 720కి పైగా సిలిండర్లను వినియోగదారులు ముందే బుక్‌ చేసుకున్నారన్నారు. ఈ కారణంగా సరఫరాపై ఒత్తిడి పెరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement