బనశంకరి: ఉద్యోగం అండతో జనం నుంచి లంచాలు, కానుకల రూపంలో వెనకేసుకున్న కోట్లాది రూపాయల ఆస్తుల గుట్టురట్టయింది. గత గురువారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 10 మంది ప్రభుత్వ అధికారుల నివాసాలు, ఆఫీసుల్లో లోకాయుక్త అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.35.65 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. వారితో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు చేయగా పెద్దమొత్తంలో డబ్బులు, బంగారం, స్థలాలు, పొలాలు, విలువైన సొత్తు దొరికింది. ఆ వివరాలను లోకాయుక్త విడుదల చేసింది.
కనీసం రూ.4, 5 కోట్లు...
● అసిఫ్ ఇక్బాల్ ఖలీల్–అసిస్టెంట్ ఇంజనీర్, కర్ణాటక నగర నీటి సరఫరా భూగర్బడ్రైనేజీ మైసూరు: రూ.5.80 కోట్ల విలువ చేసే 5 స్థలాలు,7 ఇళ్లు, 38 గుంటల భూమి, రూ.2.78 కోట్ల విలువచేసే స్థిరాస్థులు, రూ.22.50 లక్షల విలువచేసే బంగారం సహా రూ.8.81 కోట్ల ఆస్తులు కనిపెట్టారు.
● వసంత వాలప్ప నాయక్– చీఫ్ ఇంజనీర్ ప్రజాపనుల శాఖ బెంగళూరు: 10 చోట్ల రూ.5.65 కోట్ల విలువచేసే 4 ప్లాట్లు, 7 నివాస ఇళ్లు, 22.20 ఎకరాల పొలం, రూ.75 లక్షల నగదు, రూ.12.25 లక్షల నగలు, రూ.34.25 లక్షల విలువ చేసే కార్లు, రూ.27.49 లక్షల డిపాజిట్లు లభించాయి.
● డాక్టర్ హెచ్‌సీ.ఇంద్రేశ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెబ్బాల మెడికల్ కాలేజీ, బెంగళూరు: 6 చోట్ల రూ.2.20 కోట్ల విలువచేసే 10 స్థలాలు, 2 ఇళ్లు, రూ.11.95 లక్షల బంగారం, రూ.18.90 లక్షల వాహనం, మొత్తం రూ.2.53 కోట్ల ఆస్తులు కనిపెట్టారు.
● ఆర్.శశిధర్, సీఈఓ సింగనాయకనహళ్లి రైతు సేవా సహకార సంఘం యలహంక, బెంగళూరు: 5 చోట్ల రూ.4.25 కోట్ల భూములు,, 4 స్థలాలు, 2 ఇళ్లు, 2 ఎకరాల భూమి, రూ.29.74 లక్షల బంగారం, రూ.42.25 లక్షల విలాసవంతమైన కార్లు, .17.25 లక్షల బ్యాంకు డిపాజిట్లతో కలిపి రూ.5.15 కోట్ల ఆస్తులు దొరికాయి. ఇలా మిగతా ఆరుమంది వద్ద రూ.4 కోట్ల నుంచి 6 కోట్ల అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి.
లోకాయుక్త దాడుల్లో
వెలుగుచూసిన ఆస్తిపాస్తులు


