సమాజానికి మహిళే ఆలంబన | - | Sakshi
Sakshi News home page

సమాజానికి మహిళే ఆలంబన

Mar 10 2026 12:53 PM | Updated on Mar 10 2026 12:53 PM

బనశంకరి: అలనాటి మేటి నటీమణులకు ఘనంగా సన్మానించారు. సోమవారం గ్రేటర్‌ బెంగళూరు ప్రాధికార ఆఫీసులోని గ్లాజ్‌హౌస్‌లో జీబీఏ–పాలికె అధికారులు , ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని కమిషనర్‌ మహేశ్వర్‌రావ్‌ ప్రారంచారు. ప్రముఖ నటీమణి జయప్రద మాట్లాడుతూ... మహిళ తల్లి, చెల్లి, అక్కగా కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి శ్రమిస్తున్నారని తెలిపారు. నటి మహాలక్ష్మీ మాట్లాడుతూ మహిళలు స్వాభిమానిగా , స్వావలంబనతో జీవించాలని తెలిపారు. జయప్రద, ఉర్వశి, మహాలక్ష్మీ, ప్రమీళా జోషాయ్‌, మంజుళా గురురాజ్‌ సహా నటీమణులు, పలురంగాల మహిళలైన డాక్టర్‌ ఇందిరా కబాడే, రేణుకా, శుభ, చైత్ర అంచన్‌, వీణాపూజారి, డాక్టర్‌ ప్రియదర్శిని, శైలజా, లక్ష్మీదేవి, వాణిశ్రీ, సంధ్యా ప్రభు, చైత్ర పూర్ణిమా, ఆరతి ప్రసాద్‌, పూనం బెళ్లప్ప, లక్ష్మీ దివ్య, వరలక్ష్మీ, విజయలక్ష్మీ, తనూజా తదితరులను సన్మానించారు.

ప్రముఖ నటి జయప్రద

బెంగళూరులో మహిళా దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement