సమాజ సేవే ఎన్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సమాజ సేవే ఎన్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం

Mar 14 2026 7:36 AM | Updated on Mar 14 2026 7:36 AM

రాయచూరు రూరల్‌: సమాజ సేవే ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన లక్ష్యమని వెంకటేశ్వర డిగ్రీ కళాశాల అధ్యక్షుడు సంతోష్‌ కుమార్‌ రాజ్‌గురు తెలిపారు. శుక్రవారం రాయచూరు తాలుకా దిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రాయచూరు మహర్శి వాల్మీకి విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల సమస్యలు అర్థం అవుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పాఠ్యాంశాలుగా చేర్చాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ నిస్వార్థంతో సేవలు అందిస్తుందని వివరించారు. గ్రామాల్లో స్వచ్ఛత, రక్తాదాన శిబిరాలు, ఆరోగ్యం, పరిసరాల సంరక్షణపై విద్యార్థులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిడు సుభాష్‌ చంద్ర, వీరేష్‌, చిదానందప్ప, హన్మంతు నాయక్‌, శరణప్ప, అనిత, అమరేష్‌, సతీష్‌, రంగస్వామి, రంగనాథ్‌, మహేష్‌ సునంద పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement