సాక్షి, బళ్లారి: నగరంలో రోజు రోజుకు ఎండలు మండుతున్నాయి. భానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. బిసలు బళ్లారి (ఎండల బళ్లారి)గా ఖ్యాతి పొందిన బళ్లారిలో ఎండాకాలం వచ్చిందంటే ఎండలు విపరీతంగా పెరిగిపోవడం పరిపాటి. నగరంలో ఉదయం 10 గంటల నుంచి ఉక్కపోత అధికం అవుతోంది. ఎండ వేడిమికి ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి పానీయాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. మార్చి నెలలోనే ఎండల తీవ్రత పెరగడంతో ఈసారి బళ్లారి నగరంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు, కాలినడకన వెళ్లే వారికి ట్రాఫిక్ కూడళ్లలో నీడ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రముఖ కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్ ఉన్న ప్రధాన రహదారుల్లో గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేశారు. ఎండతాపం నుంచి బయటపడేందుకు ఈ గ్రీన్‌నెట్స్ దోహదం చేస్తాయని పాలికె అధికారులు తెలిపారు.


