హొసపేటె: కూడ్లిగి తాలూకా హుడెం గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్‌కు బళ్లారి లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ ఇ.తుకారాం విన్నవించారు. శుక్రవారం మంత్రిని కలసి వినతిపత్రం అందజేశారు. కూడ్లిగి తాలూకా సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన ప్రాంతం అని తెలిపారు. ఈ ప్రాంతంలో ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభిచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల స్థాపన భవిష్యత్ తరం తగినంత విద్యా పురోగతిని సాధించడానికి దోహదపడుతుందని వివరించారు. ఇందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరమ్ సానుకూలంగా స్పందించారు. పాఠశాలను వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.


