అయ్యో శిశువా అమ్మకు బరువా? | - | Sakshi
Sakshi News home page

అయ్యో శిశువా అమ్మకు బరువా?

Mar 16 2026 7:39 AM | Updated on Mar 16 2026 7:39 AM

రోడ్డు పాలైన పసికందు

కోలారు: సంతానం లేదని అంగలార్చేవారు కొందరైతే, పుట్టిన పిల్లలను నిర్దయగా పడేసేవారు మరికొందరు. తల్లిదండ్రులు ఎవరో గానీ, అప్పుడే పుట్టిన మగ శిశువును రోడ్డుపై పడేసిపోయారు. ఈ హృదయ విదారక సంఘటన బంగారుపేట తాలూకా లక్కేనహళ్లి గ్రామం వద్ద జరిగింది. శిశువు గుక్కపెట్టి ఏడుస్తుండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే దగ్గరకు తీసుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తరువాత కామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెళ్లి చేర్పించారు. అక్కడి నుంచి శిశు పాలనా కేంద్రంలో అప్పజెప్పారు. పసికందు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement