మరో వారం గ్యాస్‌ ట్రబులే | - | Sakshi
Sakshi News home page

మరో వారం గ్యాస్‌ ట్రబులే

Mar 19 2026 8:24 AM | Updated on Mar 19 2026 8:24 AM

ఏయే రంగానికి ఎంత మేర గ్యాస్‌ సిలిండర్లు ఇస్తారు?

శివాజీనగర: ఇరాన్‌– ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం ముగిసే సూచనలు లేవు. పైగా గ్యాస్‌, ఇంధన ఉత్పత్తి కేంద్రాలపై బాంబు దాడులు జరుగుతున్నాయి. దీంతో గ్యాస్‌ సరఫరాపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో గృహోపయోగ వంటగ్యాస్‌ సిలిండర్‌ సరఫరాకు ఇబ్బంది లేదు, అయితే మరో వారం పాటు కమర్షియల్‌ సిలిండర్ల పంపిణీ కష్టమని పౌర సరఫరాల మంత్రి కే.హెచ్‌.మునియప్ప చెప్పారు. బుధవారం అసెంబ్లీలో ఆయన ఈ విషయం తెలిపారు. ఒక కుటుంబానికి నెలకు ఒక సిలిండర్‌ ఇవ్వడానికి సమస్య లేదు, ప్రస్తుతం 10 రోజులకు సరిపడే నిల్వ ఉంది, ప్రజలు కంగారుతో ఎక్కువ సిలిండర్లను బుక్‌ చేసుకోరాదు అని తెలిపారు. కమర్షియల్‌ సిలిండర్ల స్టాకు తక్కువగా ఉందని, హోటల్‌ యజమానులు సహకరించాలని మంత్రి కోరారు. కనీసం 10 రోజుల వరకు హోటళ్లలో కరెంటు స్టవ్‌లు వాడుకోవడం మంచిదని సూచించారు. ఉన్న కొద్ది సిలిండర్‌లను ముందుగా ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లకు సరఫరా చేస్తామన్నారు. హోటళ్ల యజమానులు ఇబ్బందులను తట్టుకోవాలని కోరారు. గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి కేంద్ర ప్రభుత్వానికి సీఎం లేఖ రాశారని తెలిపారు.

మార్గదర్శకాలు జారీ

కమర్షియల్‌ వంట గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి (ఎల్‌పీజీ) రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆసుపత్రి, విద్యా సంస్థలకు ప్రాధాన్యతనిస్తూ 100 శాతం పంపిణీకి ఆదేశించింది. అయితే హోటల్‌లకు 10 శాతం పంపిణీతో సరిపెట్టడం గమనార్హం. గురువారం నుంచి గ్యాస్‌ పంపిణీ చేపట్టాలని తెలిపింది. హోటల్‌లు బుధవారం నుంచి కమర్షియల్‌ గ్యాస్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

బెంగళూరులో ఇళ్లకూ ఇబ్బంది

యశవంతపుర: బెంగళూరులో గ్యాస్‌ కొరత రోజురోజుకు అధికమవుతోంది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లు లేక హోటల్స్‌, రెస్టారెంట్‌లు, క్యాంటీన్లు, మెస్సులు, పీజీ హాస్టళ్లు తదితరాలు అవస్థలు పడుతున్నాయి. ఇప్పుడు ఇళ్లలోనూ గ్యాస్‌ సమస్య అధికమైనట్లు తెలుస్తోంది. ఏజెన్సీల వద్ద జనం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిలిండర్ల కోసం వేచిచూస్తున్నారు. గతంలో గ్యాస్‌ను ఫోన్‌లో బుక్‌ చేస్తే ఇంటికే సరఫరా చేసేవారు. కానీ పరిస్థితి మారిపోయింది. బుక్‌ చేసినా సిలిండర్‌ రావడం లేదని, వెంటనే ఇవ్వాలని ఏజెన్సీల వద్ద గొడవకు దిగుతున్నారు. కొన్న ఏజెన్సీల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.

ప్రాధాన్యత పరంగా కమర్షియల్‌

సిలిండర్ల పంపిణీ

అసెంబ్లీలో మంత్రి మునియప్ప వెల్లడి

కరెంటు స్టవ్‌లు ఉపయోగించాలని సూచన

ఆసుపత్రులు, విద్యాసంస్థలకు – 100 శాతం

నూనెలు, సీడ్‌ ప్రాసెసింగ్‌ – 70 శాతం

ఎయిర్‌లైన్స్‌, రైల్వేస్‌కు – 70 శాతం

హోటళ్లు, పరిశ్రమల క్యాంటీన్లు – 10 శాతం

వృద్ధాశ్రమాలకు – 70 శాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement