చెట్టును బస్సు ఢీ | - | Sakshi
Sakshi News home page

చెట్టును బస్సు ఢీ

Mar 16 2026 7:24 AM | Updated on Mar 16 2026 7:24 AM

11 మందికి గాయాలు

హుబ్లీ: అడ్డు వచ్చిన కారును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన బెళగావి జిల్లా కానపుర తాలూకా నందగడలో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బెళగావి డిపో నుంచి నందగడకు బయలుదేరింది. బస్సు నందగడకు చేరుకోగానే ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో మొత్తం 11 మంది ప్రయాణిస్తుండగా అందరికీ గాయాలయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నందగడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement