వృద్ధురాలి డిజిటల్‌ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి డిజిటల్‌ అరెస్టు

Mar 18 2026 11:18 AM | Updated on Mar 18 2026 11:18 AM

బనశంకరి: వృద్ధురాలిని భయపెట్టి డిజిటల్‌ అరెస్ట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు రూ.38 లక్షలు దోచుకున్నారు. వివరాలు.. బెంగళూరు తూర్పు సైబర్‌ ఠాణా పరిధిలో ఇది జరిగింది. ఈ నెల 11వ తేదీన వృద్ధురాలు గీతకు ఓ ఫోన్‌ వచ్చింది, ముంబై బ్యాంకులో మీ పేరుతో అకౌంట్‌ తెరిచి ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశారని వృద్ధురాలిని బెదిరించారు. రిజర్వు బ్యాంకు మీ ఖాతాలను పరిశీలిస్తుంది, వెంటనే రూ.38 లక్షల నగదు జమచేయాలి, గంట తరువాత మీ డబ్బులు మళ్లీ అకౌంట్‌కు జమ చేస్తాం అని నేరగాళ్లు నమ్మించారు. గీతా నిజమేననుకుని తన వద్ద ఉన్న రూ.38 లక్షలను వంచకులు తెలిపిన అకౌంట్‌కు జమచేసింది. 3 రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడరాదని బెదిరించారు. డబ్బు పంపిన 2 రోజుల తరువాత కూడా ఖాతాకు జమ కాకపోవడంతో సైబర్‌ నేరగాళ్ల మోసమని ఆమె తెలుసుకుంది. సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.

దంత విద్యార్థికి రూ.4.44 లక్షలు..

మైసూరు: ప్రముఖ కంపెనీల డిస్ట్రిబ్యూటరీ ఏజెన్సీని ఇప్పిస్తామని ఓ విద్యార్థిని నమ్మించిన దుండగుడు రూ.4.44 లక్షలను టోపీ వేశాడు, మైసూరులోని నిమిషాంబ బడావణె నివాసి, దంత వైద్య విద్యార్థి రోహిత్‌ బాధితుడు. అతనికి ఓ ఈ–మెయిల్‌ వచ్చింది, లాభాలు పంచే వ్యాపారం ప్రారంభించేందుకు పేరు మోసిన కంపెనీ ఉత్పత్తుల డిస్ట్రిబ్యూటరీ ఏజెన్సీని ఇప్పిస్తామని తెలిపారు. అందులో ఉన్న మొబైల్‌ నంబరుకు రోహిత్‌ సంప్రదించాడు. నీకు ఏజెన్సీ ఇప్పిస్తామని, ముందు కొంత రుసుము కట్టాలని పలు విడతల్లో రూ.4.44 లక్షలను తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. మళ్లీ మళ్లీ డబ్బులు కట్టాలని మోసగాడు ఒత్తిడి చేయడంతో వంచనకు గురైనట్లు గ్రహించిన రోహిత్‌ కువెంపునగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఉగ్రవాదులకు సహకరించావని...

రూ.38 లక్షల వసూలు

బెంగళూరులో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement