సాక్షి బళ్లారి: మాతృత్వ సెలవుల తర్వాత మహిళా ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ విధుల్లో చేరడానికి, వారి పిల్లల సంరక్షణకు అనుకూలంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విధాన పరిషత్ సభ్యుడు వైఎం. సతీష్ పేర్కొన్నారు. సోమవారం విధాన పరిషత్ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గర్భధారణ సమయంలో ముందుగా 6 నెలలు పుట్టిన శిశువును చూసుకోవాల్సిన బాధ్యత తల్లిపై ఉంటుందన్నారు. మానవతా దృక్పథంతో ఆరు నెలలకే పరిమితం చేయకుండా, ఆమె కోరుకున్న స్థలంలో ఐదేళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీ ప్రశ్నపై స్పందించిన మంత్రి ఎస్.మధు బంగారప్ప మాట్లాడుతూ శిశు సంరక్షణ సెలవులు మంజూరుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు.
జీవో ప్రకారం చర్యలు
ప్రభుత్వ జీవో ప్రకారం శిశు సంరక్షణ సెలవుల కోసం వచ్చిన దరఖాస్తులు 15 రోజుల్లోపు ఆమోదించేందుకు సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. ఆమె సెలవు రోజుల్లో ఆ స్థానంలో పని చేసేందుకు అతిథి ఉపాధ్యాయులను కూడా నియమించుకునేందుకు వెసులుబాటు కల్పించామన్నారు.
విధాన పరిషత్‌లో ఎమ్మెల్సీ సతీష్ విజ్ఞప్తి


