శివాజీనగర: విద్యార్థి జీవితంలో ఉన్నత చదువులకు ముఖద్వారం వంటి ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్) పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి. ఈసారి 9,02,889 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. రాష్ట్రంలో 15,941 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షా కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
పకడ్బందీ భద్రత
అక్రమాలు జరగకుండా కర్ణాటక పాఠశాల పరీక్ష, మూల్యాంక నియంత్రణ మండలి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, లోపలకు ఎవరూ మొబైల్ ఫోన్లను తీసుకురాకుండా నిషేధం, కేంద్రాల పరిసరాలలో నెట్, జిరాక్స్ సెంటర్ల మూసివేత వంటి చర్యలను చేపట్టింది. పోలీసు బందోబస్తుతో పాటు పరీక్షా కేంద్రం చుట్టుపక్కల 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు ఉంటాయి. పరీక్షార్థులు ఆర్టీసీ, సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు


