మంచు తుపాను? | - | Sakshi
Sakshi News home page

మంచు తుపాను?

Mar 18 2026 11:18 AM | Updated on Mar 18 2026 11:18 AM

బనశంకరి: వేసవి ఎండల మధ్య మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హఠాత్తుగా వడగండ్ల వర్షం విరుచుకుపడింది. కలఘటగి పట్టణం, పరిసరాల్లో నిమ్మకాయ సైజంత మంచుగడ్డలు ఆకాశం నుంచి పడడంతో జనం ఆశ్చర్యానికి లోనయ్యారు. దెబ్బలు తగలకుండా సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టారు. ఎక్కడ చూసినా నాలుగైదు ఇంచుల ఎత్తున మంచుముక్కలు పరచుకున్నాయి. తామెప్పుడూ ఇలాంటిది చూడలేదని స్థానిక ప్రజలు సంభ్రమానికి లోనయ్యారు. యువత సెల్ఫీలు, వీడియోలలో బంధించారు. వడగండ్ల ధాటికి పంటపొలాలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల గుడిసెలు, పెంకుటిళ్లు సైతం ధ్వంసమయ్యాయి.

బెంగళూరులో జోరువాన

మరోవైపు బెంగళూరు నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎండాకాలంలో వర్షం పడటంతో చల్లదనం ఏర్పడింది. బెంగళూరులో మరో రెండు మూడు రోజులు వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉగాది కి మొదటి వర్షం రావడం శుభ సూచికగా భావిస్తారు. యలహంకలో అర్ధగంటకు పైగా వర్షం కురిసింది. చిక్కమగళూరు, బెళగావి, హుబ్లీ– ధార్వాడ, బళ్లారి, విజయనగర తదితర ప్రాంతాల్లోనూ వడగండ్లు, పిడుగులతో కూడిన వానలు పడ్డాయి.

ఎటుచూసినా మంచు ముక్కలు. రోడ్లు, ఇళ్ల ముందు, పొలాలు, మైదానాలు తెల్లని మంచు దుప్పటిని కప్పుకున్నాయి.. కశ్మీరు గురించి ఎవరైనా ఇలా చెబుతారు. కానీ వాతావరణం చేసిన మాయకు ధార్వాడ జిల్లాలోని కలఘటగి పట్టణం వడగండ్లతో నిండిపోయింది. అలాగే చిక్కమగళూరు జిల్లాలోనూ

వడగండ్ల వాన ముంచెత్తింది.

ధార్వాడ జిల్లా కలఘటగిని ముంచెత్తిన వడగండ్లు

పలు జిల్లాల్లో ఆకస్మిక వానలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement