ఉరికి వేలాడిన తల్లీ బిడ్డ | - | Sakshi
Sakshi News home page

ఉరికి వేలాడిన తల్లీ బిడ్డ

Mar 12 2026 7:43 AM | Updated on Mar 12 2026 7:43 AM

తుమకూరు: తల్లి, చిన్నారి కూతురితో కలిసి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ హృదయవిదారక ఘటన గుబ్బి తాలూకాలో హాగలవాడిలో జరిగింది. యతీశ్‌, భార్య గంగామణి (29), పిల్లలతో నివసిస్తున్నారు. గంగామణిది తిపటూరు తాలూకా జక్కనహళ్లి. 9 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 8 ఏళ్ల కుమారుడు వినయ్‌, 5 ఏళ్ల కుమార్తె రక్షితా, రెండేళ్ల ప్రేక్ష అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కడుపునొప్పి, రుతుస్రావ అనారోగ్యంతో ఆమె బాధపడుతోందని అత్తింటివారు చెబుతున్నారు. వైద్యులతో చికిత్స తీసుకున్నా నయం కాలేదని చెప్పారు. దీంతో విరక్తి చెంది ఒకే చీరతో కూతురు ప్రేక్షకి ఉరిబిగించి ఆమె ఉరివేసుకున్నట్లు తెలిపారు. ఆమె తల్లి దాక్షాయణమ్మ చేళూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

బీజేపీ ఎమ్మెల్యేకు బెయిలు

బనశంకరి: కాంట్రాక్టరు నుంచి లంచం తీసుకున్నారనే కేసులో లోకాయుక్త పోలీసులు అరెస్ట్‌ చేసిన గదగ్‌ జిల్లా శిరహట్టి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ చంద్రు లమాణికి బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో కొన్ని రోజులుగా పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో ఉన్న ఎమ్మెల్యే చంద్రుకు ఊరట దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement