తుమకూరు: విడాకులు కావాలంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్న జంటకు లోక్ అదాలత్‌లో మళ్లీ పెళ్లి చేశారు. చిక్కనాయకనహళ్లి కోర్టు కాంప్లెక్స్‌లో శనివారం తాలూక్ లీగల్ సర్వీసెస్ కమిటీ నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్‌లో సీనియర్ సివిల్ జడ్జి సతీష్ ఎస్.టి. సమక్షంలో ఏకం చేశారు. దంపతులు శైల, శ్రీరాఘవేంద్ర గొడవలు పడి విడాకుల కేసు వేసుకున్నారు. అయితే జడ్జి సతీష్, న్యాయవాదులు వారికి నచ్చజెప్పి పూలదండలు తెప్పించి రాజీ చేశారు. న్యాయవాదులు టి.రవీంద్రకుమార్ ఎం.బి. నాగరాజు, రమేష్ బాబుపాల్గొన్నారు.


