అబ్కారీ శాఖలో అవినీతి మత్తు | - | Sakshi
Sakshi News home page

అబ్కారీ శాఖలో అవినీతి మత్తు

Mar 15 2026 1:25 AM | Updated on Mar 15 2026 1:25 AM

బనశంకరి: ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలతో ఉడుపి జిల్లా ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ టీఎం శ్రీనివాస్‌పై శనివారం లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించారు. లోకాయుక్త మంగళూరు ఎస్పీ దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో మంగళూరు, ఉడుపితో పాటు రాష్ట్రంలోని 15 చోట్ల సోదాలు చేపట్టారు. అబ్కారీ శాఖ అధికారిగా రెండుచేతులా అక్రమార్జనకు పాల్పడుతున్నారని లోకాయుక్తకు ఫిర్యాదులు రావడంతో ఆకస్మికంగా తనిఖీలు ప్రారంభించారు.

ఆస్తుల వివరాలు

ఈ సోదాల్లో రూ.8.69 కోట్ల విలువచేసే అక్రమాస్తులను కనిపెట్టారు. రూ.6,90,64,716 విలువచేసే స్థిరాస్తులు ఉండగా ఇందులో 11 స్థలాలు ఉన్నాయి. అత్యాధునిక వసతులతో కూడిన 6 ఇళ్లు, 31 ఎకరాల పొలం ఉన్నాయి. చరాస్తులు రూ.2,66,90,001 ఉండగా ఇందులో రూ.3,95,941 నగదు, రూ.1.47 కోట్ల విలువచేసే బంగారు ఆభరణాలు, రూ.17 లక్షల విలువచేసే కార్లు, రూ.25.75 లక్షల నగదు డిపాజిట్‌, రూ.72.68 లక్షల గృహ సామగ్రి లభించాయి. ప్రభుత్వానికి లోకాయుక్త నివేదిక చేరగానే ఆయనను సస్పెండ్‌ చేస్తారని తెలుస్తోంది.

ఉడుపి జిల్లా డిప్యూటీ కమిషనర్‌పై

లోకాయుక్త దాడులు

రూ.8 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement