30 వేల లీటర్ల బీరు నేలపాలు | - | Sakshi
Sakshi News home page

30 వేల లీటర్ల బీరు నేలపాలు

Mar 12 2026 7:43 AM | Updated on Mar 12 2026 7:43 AM

మైసూరు: కేఎస్‌బీసీఎల్‌ మైసూరు డిపో–1, కేఎస్‌బీసీఎల్‌ మైసూరు డిపో–2లో అమ్ముడు పోకుండా గడువు మీరిపోయిన వివిధ రకాల మొత్తం 30,366 లీటర్ల బీరు పానీయాన్ని కూర్గళ్లి డిపోలో ధ్వంసం చేశారు. మైసూరు ఉప విభాగ ఎకై ్సజ్‌ డీఎస్పీ హెచ్‌కే రమేష్‌ నేతృత్వంలో అధికారులు, ఉద్యోగులు బీరు బాటిళ్లలోని బీరును డ్రైనేజీలో పారబోశారు. దీనిపై మందుబాబులు సోషల్‌ మీడియాలో సరదాగా ఆవేదనను వ్యక్తంచేశారు. ఆ బీర్లను తమకు ఇచ్చి ఉంటే ఖాళీ చేసేవారమని, అధికారులకు శ్రమ తప్పేదని తెలిపారు.

ఎక్కువ ధరల వల్లే ఇంత వృథా

కాగా, ధరలు ఎక్కువగా ఉండడం వల్ల బీర్ల విక్రయాల తగ్గినట్లు అధికారులు తెలిపారు. మద్యం కంపెనీల నుంచి సరుకును డిపోలకు తీసుకొస్తారు. ఇక్కడి నుంచి వైన్స్‌ వ్యాపారులకు విక్రయిస్తారు. అయితే షాపుల్లో బీర్లకు గిరాకీ తగ్గిపోవడంతో డిపోలలో స్టాకు నిలిచిపోయి ఎక్స్‌పైరీ అవుతోందని వివరించారు. ప్రభుత్వం ధరలను తగ్గిస్తే గిరాకీ పెరిగి ఇలా వృథా కావడం తగ్గుతుందని అన్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే మంచిదేమో.

అధిక ధరల ఎఫెక్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement