ఇద్దరు రౌడీల అరెస్టు, పిస్టళ్ల స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు రౌడీల అరెస్టు, పిస్టళ్ల స్వాధీనం

Mar 11 2026 7:53 AM | Updated on Mar 11 2026 7:53 AM

కృష్ణరాజపురం: అక్రమంగా పిస్టళ్లు కలిగిన బెంగళూరు, మైసూరు రౌడీలను పోలీసులు అరెస్టు చేశారు. నాగేంద్ర, సొహైల్‌ లాక్‌ పట్టుబడిన నిందితులు. ఓ రౌడీ సహచరుడైన నాగేంద్రపై నాలుగు హత్య కేసులున్నాయి. వీటిలో రెండింట్లో అరెస్టు వారంట్‌ జారీ అయింది. గత ఏడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నాగేంద్ర ఇటీవల బన్నేరుఘట్ట మెయిన్‌ రోడ్డులో బాడుగ ఇంట్లో మకాం వేశాడు, పోలీసులు పసిగట్టి అతన్ని బంధించారు. అతని వద్ద ఓ పిస్టల్‌ లభించింది, విచారించగా మైసూరుకు చెందిన ప్రముఖ రౌడీషీటర్‌ సొహైల్‌ లాక్‌ దానికి విక్రయించాడని, అతనిపై 7 కేసులున్నాయని తేలింది. ఇందులో 5 హత్యాయత్నం కేసులు. వారి నుంచి 2 పిస్తోళ్లు, కొన్ని తూటాలను సీజ్‌ చేసిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement