రాజస్థానీ గజదొంగ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రాజస్థానీ గజదొంగ పట్టివేత

Mar 11 2026 7:53 AM | Updated on Mar 11 2026 7:53 AM

బనశంకరి: తాళం వేసిన ఇళ్లలో బంగారం, డబ్బును ఎత్తుకెళ్లే రాజస్థానీ దొంగను బెంగళూరు యలహంక పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇతని వద్ద నుంచి రూ.3 కోట్ల విలువచేసే వజ్రాలు, నగలను స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌కుమార్‌సింగ్‌ తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన వల్లరాం మీనా అలియాస్‌ సునీల్‌ (19) ఈ దొంగ. గత నెల15వ తేదీన ఆర్‌టీ నగరలో ఓ టెక్కీ ఇల్లు తాళం వేసి ఉండగా, టెర్రస్‌ మీద తలుపు బద్దలుకొట్టి ఇంట్లోకి చొరబడి వజ్రాలు, బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. రాజస్థాన్‌లోని గింగలా ఠాణా పరిధిలోని మణగిరిపాల గ్రామంలో సునీల్‌ను అరెస్ట్‌ చేశారు. చోరీకి పాల్పడిన 1.8 కేజీల బంగారు నగలు, వజ్రాల ఆభరణాలను అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

రూ.3 కోట్ల బంగారం సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement