ప్రియుడి ఇంటి ముందు ధర్నా
నల్గొండ జిల్లా: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. ఈ ఘటన నకిరేకల్ మండలం నెల్లిబండలో శనివారం వెలుగులోకి వచ్చింది. నెల్లిబండ గ్రామానికి చెందిన బాధితురాలు రేణుక తెలిపిన వివరాల ప్రకారం..
తనకు నెల్లిబండ గ్రామానికే చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, అతడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీనం చేసి గర్భవతిని చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు రేణుక తెలిపింది. బిడ్డ పుట్టిన తర్వాత తనను పట్టించుకోకుండా మరో మహిళను పెళ్లి చేసుకుని అన్యాయం చేశాడని, తనకు న్యాయం చేయాలని శనివారం అతడి ఇంటి ముందు ధర్నాకు దిగినట్లు ఆమె పేర్కొంది. కాగా ఈ విషయంలో గ్రామ పెద్దమనుషులు జోక్యం చేసుకుని పంచాయితీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు.


