అతను ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్‌ కాదు..కానీ సంపదలో అదానీ రేంజ్‌..! | Self Made Billionaire Who Became Indis Second Richest After Gautam Adani | Sakshi
Sakshi News home page

Success Story: అతను ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్‌ కాదు..కానీ సంపదలో అదానీ రేంజ్‌..!

Oct 13 2025 4:14 PM | Updated on Oct 13 2025 6:26 PM

Self Made Billionaire Who Became Indis Second Richest After Gautam Adani

కొన్ని సక్సెస్‌ స్టోరీలు ఎంతలా ప్రేరేపిస్తాయంటే.. జీరో నుంచి మిలియనీర్‌గా అవతరించడం ఎలా అనేది నేర్పిస్తాయి. తాతల తండ్రులు కాస్త సంపాదించే పెడితే కదా జీవితం బాగుండేది..మంచి చదువులు చదవగలిగేది అనుకుంటారు చాలామంది. అవన్నీ సాధించడం చేతకాని వాడు చెప్పే చెత్తకబుర్లే అవి పలువురు విజేతలు ప్రూవ్‌ చేశారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ వ్యక్తి. అతడికి ఎలాంటి వ్యాపార సామ్రాజ్య వారసత్వం లేకపోయినా.. కేవలం తనపై ఉన్న అచంచలమైన నమ్మకం, పట్టుదలతో కుభేరులు అవ్వొచ్చని చూపించి..ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.

అతడే గుజరాత్‌కి చెందిన పంకజ్ రామన్‌భాయ్ పటేల్(Pankaj Ramanbhai Patel). కోటీశ్వరుడి కావాలంటే వారసత్వం, వ్యాపార సామ్రాజ్యం ఉండాల్సిన పనిలేదంటాడు పటేల్‌. ఆయన సంపదలో గౌతమ్‌ అదానీ తర్వాత రెండో అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కాడు. ఆయన సంపద విలువ అక్షరాల రూ. 84,510 కోట్లు. ఆయన ఓ సాదాసీదా కంపెనీలో జాయిన్‌ అయ్యి..దాన్ని లాభాల బాట పట్టించి.. నెంబర్‌ వన్‌ స్థాయిలో  నిలబెట్టడమే కాదు దానికే నాయకత్వం వహించే రేంజ్‌కి వచ్చాడు. 

ఫార్మసి, లైఫ్‌సైన్సు అండ్‌ లాలో డిగ్రీలు చేసిన ఆయన..తరుచు ఏం చేయాలి,..ఏంటి లక్ష్యం అని ఆలోచిస్తుండేవాడు. అలా కాడిలా హెల్త్‌కేర్‌ అనే ఒక చిన్న కంపెనీలో చేరాడు. ఆయన ఉద్యోగిగా మొదలైనప్పుడూ ఆ కంపెనీ చాలా సాదాసీదా కంపెనీ. అయితే పంకజ్‌ పర్యవేక్షణలో శరవేగంగా అభివృద్ధి బాటలో పయనించి..కాడిలా జైడస్ లైఫ్‌సైన్సెస్‌గా పరిణామం చెందింది. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. 

ఆ సమయంలోనే ఆయన పేరు బయటకొచ్చింది..
ఆయన ఎదుగుదలను కూడా అత్యంత నిరాడంబరంగానే ఉంటుంది. ఎక్కడ ఎలాంటి పబ్లిసిటీలకు చోటివ్వరాయన. కోవిడ్‌ సమయంలోనే ఆయన పేరు బయటకొచ్చింది. అప్పటి దాక ఏ సరికొత్త టీకాలు లేదా ఔషధాల ఆవిష్కరణకు విదేశాల ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండేది. కానీ ఆ కష్ట సమయంలో జైడస్ భారతదేశంలో మొట్టమొదటి DNA-ఆధారిత COVID-19 వ్యాక్సిన్ అయిన జైడస్ జైకోవి-డిని అభివృద్ధి చేసి..అతిపెద్ద శాస్త్రీయ విజయం అందుకుంది. పైగా దీనికి విదేశీ ధ్రువీకరణతో పనిలేదంటూ ఓ సరికొత్త మైలురాయిని సాధించింది. 

ఇక పంకజ్‌ వ్యక్తిగతం జీవితం దగ్గరకి వచ్చేటప్పటికీ..ఆయన ప్రీతి పటేల్‌ని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఆయన కుమారుడు డాక్టర్ షార్విల్ పటేల్‌ ఆ కంపెనీలోనే మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇక కూతురు శివాని కూడా అన్న బాటలో పయనిస్తున్నారు. ఇక 2003లో పంకజ్ పటేల్‌కు ఉత్తమ ఫార్మా మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డు లభించింది. ఈ గుర్తింపుని సైతం ఆయన నిశబ్దంగానే సెలబ్రేట్‌ చేసుకున్నారు. 

ఇక పంకజ్‌ వృద్ధి అనేది మంచితన లేకుండా సాధ్యం కాదని గట్టిగా నమ్ముతారు. ఆ నేపథ్యంలోనే విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి తనవంతుగా సహాయ సహకారాలు అందించారు. అహ్మదాబాద్‌లో ఉండే ఇల్లు ఆయన ఆలోచనలకు అనుగుణంగా అత్యంత సాదాసీదా ఉంటుంది . ఆయన ఎప్పుడు చెప్పేది ఒక్కటే..నిలకడగా ఉండటం అలవర్చుకుంటే..ఏదైనా సాధించొచ్చు అని. 

ఒకటి అనుకుని ఇంకొకటి చేస్తూ..అస్థిర మనసుతో ఉంటే.. ఏం సాధించలేం అని సదా చెబుతుంటారాయన. ఏపనైనా ఎంచుకునేటప్పుడూ..వందశాతం కచ్చితత్వం, స్తిరత్వంతో(నిలకతో) చేయాలి. అప్పుడు ఎలాంటి రంగంలోనైనా మంచి విజయాన్ని అందుకుంటామని నొక్కి చెబుతున్నారు పంకజ్‌ రామన్‌భాయ్‌ పటేల్‌. 

(చదవండి: Sherry Singh: భారత్‌కు తొలిసారి మిసెస్‌ యూనివర్స్‌ కిరీటం.. భార్యగా, తల్లిగా ఆమె చరిత్ర..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement