నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్‌.. 23న ఫలితాలు.. | Voting begins for Assembly bypolls In 4 states | Sakshi
Sakshi News home page

నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్‌.. 23న ఫలితాలు..

Jun 19 2025 7:35 AM | Updated on Jun 21 2025 10:38 AM

Voting begins for Assembly bypolls In 4 states

Four states by polls Voting Updates..

ముగిసిన పోలింగ్‌.. 23న ఫలితాలు.

పంజాబ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల జరుగుతున్నాయి. ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఉప ఎన్నికలకు ఎన్డీయే కూటమి, ఇండియా మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక, ఐదు స్థానాలకు ఓట్ల లెక్కింపు జూన్ 23న జరుగుతుంది.

  • పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది..
  • ఉదయం 9 గంటల వరకు పోలింగ్‌ శాతం ఇలా.. 

ఉప ఎన్నికల్లో స్థానికులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

 పంజాబ్..
లూథియానా (పశ్చిమ)లో, సిట్టింగ్ ఆప్‌ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్ గోగి మరణం కారణంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అర్బన్ సీటుపై తన పట్టును నిలుపుకోవడానికి రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను పోటీకి దింపింది. కాంగ్రెస్ నుండి భరత్ భూషణ్ ఆశు, బీజేపీ నుండి జీవన్ గుప్తా, శిరోమణి అకాలీదళ్ నుండి పరూప్కర్ సింగ్ ఘుమ్మాన్‌ పోటీలో ఉన్నారు.

పశ్చిమ బెంగాల్..
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణం తరువాత కలిగంజ్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. మహిళలు, మైనారిటీ ఓటర్లను ఏకీకృతం చేసే లక్ష్యంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆయన కుమార్తె అలీఫా అహ్మద్‌ను పోటీకి దింపింది. బీజేపీ నుంచి ఆశిష్ ఘోష్‌ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్-వామపక్ష కూటమి కబిల్ ఉద్దీన్ షేక్‌ను బరిలోకి దింపింది.

గుజరాత్లో త్రిముఖ పోరు..
గుజరాత్‌లో కడి, విసావదర్‌లలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కడిలో బీజేపీ ఎమ్మెల్యే కర్సన్‌భాయ్ సోలంకి మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. బీజేపీ నుంచి రాజేంద్ర చావ్డాను, కాంగ్రెస్ రమేష్ చావ్డాను, ఆప్ జగదీష్ చావ్డాను పోటీకి దింపింది. ఇక, విశావదర్ సిట్టింగ్ ఎమ్మెల్యే భయాని భూపేంద్రభాయ్ ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో, అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆ స్థానంలో బీజేపీ నుంచి కిరీట్ పటేల్‌ను, కాంగ్రెస్ నితిన్ రాన్‌పారియాను, ఆప్ గోపాల్ ఇటాలియాను పోటీకి దింపింది.

కేరళ..
కేరళలో నీలంబూరులో ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆర్యదన్ మొహమ్మద్ కుమారుడు ఆర్యదన్ షౌకత్‌ను పోటీకి దింపగా, అధికార ఎల్‌డిఎఫ్ ఎం. స్వరాజ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement