
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడంపై హస్తం పార్టీ ఎంపీ శశిథరూర్ వింత సమాధానంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను రాహుల్ సమర్థించడంపై శశిథరూర్ స్పందిస్తూ.. ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతివ్వడానికి రాహుల్‌కు ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చు అంటూ కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తాజాగా మీడియా ప్రశ్నలపై స్పందిస్తూ.. భారత్‌కు వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామిగా అమెరికా చాలా ముఖ్యమైంది. ఎందుకంటే భారత్ నుంచి అమెరికాకు దాదాపు 90 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. ఇరుదేశాల మధ్య సముచిత వాణిజ్య ఒప్పందం కుదిరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇక, ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతివ్వడానికి రాహుల్‌కు మరేమైనా కారణాలు ఉండొచ్చు. అయితే, రాహుల్ అభిప్రాయంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల శశిథరూర్‌కు కాంగ్రెస్ పార్టీకి మధ్య అభిప్రాయభేదాలు తెరపైకి వస్తున్నాయి. ఆయన వ్యవహార శైలిపై సొంత పార్టీలో అసంతృప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్‌పై థరూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో, థరూర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
‘He Has His Reasons.….’ 😂😂😂
Shashi Tharoor Reacts To Rahul Gandhi's Remark On Trump Tariffs
Shashi Tharoor responded cautiously after Rahul Gandhi agreed with U.S. President Donald Trump’s “dead economy” remark on India. Tharoor said he wouldn’t comment on his party leader’s… pic.twitter.com/OXHodiXvdy— Augadh (@AugadhBhudeva) August 2, 2025
మరోవైపు.. భారత్ టార్గెట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ వైపు భారత్‌ను మిత్రదేశం అంటూనే మన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రష్యా, భారత్.. వాటి డెడ్ ఎకానమీలను మరింత దిగజార్చుకోనీయండంటూ వ్యాఖ్యానించారు. రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తుందనే కారణం చూపుతూ.. భారత నుంచి దిగుమతులపై 25శాతం సుంకాలతో పాటు పెనాల్టీలు విధించారు. ఈ క్రమంలోనే రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్యం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు. ఇరు దేశాలు ఆర్థికవ్యవస్థలను మరింత పతనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. అనంతరం, ట్రంప్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఆయన వ్యాఖ్యలను సమర్థించారు. ఈ క్రమంలో వివాదం నెలకొంది.