
తొలి టెస్టులో ఇన్నింగ్స్, 140 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 146 ఆలౌట్
జడేజాకు 4, సిరాజ్‌కు 3 వికెట్లు
అహ్మదాబాద్: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టులో ఎలాంటి సందేహం లేకుండా ఊహించిన ఫలితమే వచి్చంది. మ్యాచ్ పూర్తిగా మూడు రోజులు కూడా సాగలేదు. శనివారం ముగిసిన మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 140 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల వద్దే డిక్లేర్ చేసింది.
286 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన విండీస్ ఈ సారి కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. 45.1 ఓవర్లలో 146 పరుగులకే విండీస్ ఆలౌటైంది. భారత బౌలర్ల దెబ్బకు శనివారం కనీసం రెండు సెషన్లు కూడా ఆడకుండానే విండీస్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో సరిగ్గా ఒక్క ఓవర్ మాత్రమే ఆ జట్టు అదనంగా ఆడగలిగింది.
అలిక్ అతనజె (74 బంతుల్లో 38; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒక దశలో జట్టు 46 పరుగులకే సగం వికెట్లు కోల్పోగా...అతనజె, గ్రీవ్స్ (25) ఆరో వికెట్‌కు 46 పరుగులు జోడించి కొద్ది సేపు ప్రతిఘటించారు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా, సిరాజ్‌కు 3 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్‌లో సెంచరీ కూడా నమోదు చేసిన జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేయగా... ఈ నెల 10 నుంచి న్యూఢిల్లీలో రెండో టెస్టు జరుగుతుంది.
స్కోరు వివరాలు
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 162; భారత్ తొలి ఇన్నింగ్స్ 448/5 డిక్లేర్డ్;
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: క్యాంప్‌బెల్ (సి) సుదర్శన్ (బి) జడేజా 14; చందర్‌పాల్ (సి) నితీశ్ (బి) సిరాజ్ 8; అతనజె (సి) అండ్ (బి) సుందర్ 38; కింగ్ (సి) రాహుల్ (బి) జడేజా 5; ఛేజ్ (బి) కుల్దీప్ 1; హోప్ (సి) జైస్వాల్ (బి) జడేజా 1; గ్రీవ్స్ (ఎల్బీ) (బి) సిరాజ్ 25; పైర్ (నాటౌట్) 13; వారికన్ (సి) గిల్ (బి) సిరాజ్ 0; లేన్ (సి) సిరాజ్ (బి) జడేజా 14; సీల్స్ (సి) అండ్ (బి) కుల్దీప్ 22;
ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (45.1 ఓవర్లలో ఆలౌట్) 146.
వికెట్ల పతనం: 1–12, 2–24, 3–34, 4–35, 5–46, 6–92, 7–98, 8–98, 9–122, 10–146.
బౌలింగ్: బుమ్రా 6–1–16–0, సిరాజ్ 11–2–31–3, జడేజా 13–3–54–4, కుల్దీప్ 8.1–3–23–2, సుందర్ 7–1–18–1.