
భరూచ్: గుజరాత్‌లోని భరూచ్ జిల్లా, పనోలిలో గల సంఘ్వి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగల మధ్య భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పారిశ్రామిక ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి,ప్రాణ నష్టం వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
VIDEO | Bharuch, Gujarat: Fire breaks out in Sanghvi Organics Pvt Ltd in GIDC Panoli. Thick smoke and flames were visible from a distance as multiple fire tenders rushed to the spot and began firefighting operations. More details are awaited.
(Source: Third Party)
(Full video… pic.twitter.com/UMVi3UgoN6— Press Trust of India (@PTI_News) September 14, 2025
గుజరాత్‌లో ఏప్రిల్ 2న బనస్కాంత జిల్లాలోని దీసాలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటన మరువకముందే ఈ తాజా ఘటన చోటుచేసుకుంది. నాడు అక్రమ బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో 21 మంది మృతిచెందారు. మధ్యప్రదేశ్‌కు నుంచి వలస వచ్చిన కార్మికులు అధికంగా ఈ ప్రమాదం బారిన పడ్డారు. సంఘ్వి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం దరమిలా, దగ్గమైన పొగ ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టింది. గిడ్డంగిలో కొంత భాగం ఆహుతయ్యిందని సమాచారం. కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారని తెలియవస్తోంది. పోలీసులు ఈ పరిశ్రమను అక్రమంగా నడిపిస్తున్న యజమాని ఖుబ్‌చంద్ థక్కర్,అతని కుమారుడిని అరెస్టు చేశారు.