కాంగ్రెస్‌ విధానాలతో యువతకు హాని: ప్రధాని మోదీ | PM Modi Criticizes Congress, Launches Rs. 34,200 Cr Projects in Gujarat | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ విధానాలతో యువతకు హాని: ప్రధాని మోదీ

Sep 20 2025 12:59 PM | Updated on Sep 20 2025 1:24 PM

PM Modi in Gujarat Inauguration Bhavnagar Lothal National Maritime Heritage Complex

గాంధీనగర్‌: ‘భారతదేశంలో సామర్థ్యానికి ఎప్పుడూ కొరత లేదు. అయితే కాంగ్రెస్ దేశ సామర్థ్యాన్ని విస్మరించింది. అందుకే స్వాతంత్ర్యం వచ్చిన ఆరు నుండి ఏడు దశాబ్దాల తర్వాత కూడా భారతదేశం నిజంగా దక్కించుకోవలసినది సాధించలేకపోయింది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.. చాలా కాలం పాటు కాంగ్రెస్ దేశాన్ని లైసెన్స్ రాజ్‌లో బంధించి, ప్రపంచ మార్కెట్ల నుండి ఒంటరిగా ఉంచింది. తరువాత.. ప్రపంచీకరణ యుగం ప్రారంభమైనప్పుడు కాంగ్రెస్‌  కేవలం దిగుమతుల మార్గాన్ని అనుసరించింది. అప్పుడు కూడా వేల కోట్ల విలువైన కుంభకోణాలకు పాల్పడింది. ఇటువంటి విధానాలతో కాంగ్రెస్ మన దేశ యువతకు తీవ్ర హాని కలిగించింది’ అని ప్రధాని మోదీ అన్నారు.
 

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్‌లో మౌలిక సదుపాయాలు, సముద్ర రంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టి రూ.34,200 కోట్లకు పైగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి భావ్‌నగర్‌లో జరిగిన సభలో ప్రసంగించారు.

 


‘నా పుట్టినరోజున శుభాకాంక్షలు పంపిన దేశవిదేశీయులందరికీ కృతజ్ఞతలు. విశ్వకర్మ జయంతి నుండి గాంధీ జయంతి వరకు, దేశవ్యాప్తంగా సేవా పఖ్వాడాను జరుపుకుంటున్నారు. గత మూడు రోజుల్లో సేవా పఖ్వాడా కింద పలు కార్యక్రమాలు జరిగాయి. గుజరాత్‌లో ఇప్పటివరకు రక్తదాన శిబిరాల్లో లక్ష మంది రక్తదానం చేశారు. అనేక నగరాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో 30 వేలకు మించిన ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. నవరాత్రి పండుగ ప్రారంభం కానున్న సమయంలో నేను భావ్‌నగర్‌కు వచ్చాను. ఈసారి జీఎస్‌టీ తగ్గింపు కారణంగా మార్కెట్లు మరింత ఉత్సాహంగా ఉంటాయని భావిస్తున్నాను.
 

 

ఈ పండుగ వాతావరణంలోమనం ‘సముద్ర సే సమృద్ధి’ పండుగను జరుపుకుంటున్నాం. నేడు భారతదేశం ‘విశ్వబంధు’ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతర దేశాలపై ఆధారపడాల్సి రావడం. ఇదే మన అతిపెద్ద శత్రువు, ఈ శత్రువును మనం ఓడించాలి. విదేశాలపై ఆధారపడటం ఎంత ఎక్కువగా ఉంటే, దేశం అంతగా వైఫల్యం చెందుతుంది. . ప్రపంచ శాంతి, స్థిరత్వం,  శ్రేయస్సు కోసం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశం ఆత్మనిర్భర్‌ భారత్‌గా మారాలి’ అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement