
గాంధీనగర్: గుజరాత్‌లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేయడంతో శుక్రవారం నూతన క్యాబినెట్ ఏర్పాటు అయింది.
ఈ సందర్భంగా 25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా ఉన్నారు. ఈ పునర్వ్యవస్థీకరణలో గుజరాత్ హోంమంత్రి నేత హర్ష్ రమేష్‌భాయ్ సంఘవీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని లక్షకు పైగా ఓట్లతో ఓడించి ఘన విజయం సాధించారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతున్నారు.
కమలం అధిష్టానం క్యాబినెట్‌లో సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చింది. 7 మంది పాటిదార్లు, 8 మంది ఓబీసీలు, 3 మంది ఎస్సీలు, 4 మంది ఎస్టీలు, 3 మంది మహిళా నేతలు ఉన్నారు. కొత్త క్యాబినెట్‌లో ఎక్కువ మంది కొత్తవారికే అవకాశం లభించింది. గత క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల్లో కేవలం ఆరుగురు మాత్రమే తిరిగి పదవులు చేపట్టారు.
#WATCH | BJP MLA Rivaba Jadeja takes oath as Gujarat Cabinet minister in Gandhinagar pic.twitter.com/mJzv53J2C0
— ANI (@ANI) October 17, 2025