రూ. 10 వేల హోటల్‌ బిల్లు ఎగ్గొట్టి అమ్మాయిలు పరార్‌, కట్‌ చేస్తే! | Tourists Eat ₹10,900 Food, Try to Escape Without Paying in Rajasthan Hotel | Sakshi
Sakshi News home page

రూ. 10 వేల హోటల్‌ బిల్లు ఎగ్గొట్టి అమ్మాయిలు పరార్‌, కట్‌ చేస్తే!

Oct 28 2025 4:20 PM | Updated on Oct 28 2025 6:16 PM

Gujarat Tourists Dine And Dash Without Paying  bill Caught In Traffic

ఒక హోటల్‌లో కోరుకున్నవన్నీ ఆర్డర్‌ చేసుకుని, సుష్టిగా భోంచేసి, బిల్లు కట్టకుండాపారిపోవడానికి ప్రయత్నించారు. చిన్నప్పటి ట్రిక్‌  ప్లే చేసి తప్పించు కుందామనుకుంది ఒక టూరిస్ట్‌ బృందం. కట్‌  చేస్తే...

రాజస్థాన్ రెస్టారెంట్‌లో భోజనం చేసిన పారిపోవడానికి  ప్రయత్నించిన గుజరాత్‌కు చెందిన పర్యాటకుల కథ ఇది. రాజస్థాన్ లోని మౌంట్ అబూ సమీపంలోని సియావాలోని హ్యాపీ డే హోటల్‌లో దిగారు ఐదుగురు అమ్మాయిలు. హ్యాపీగా  అందరూ కలిసి మంచి రుచికరమైన, ఖరీదైన ఫుడ్‌ ఆర్డర్‌ చేశారు. బాగా ఆరగించారు. మొత్తం బిల్లు రూ.10,900 బిల్లు అయింది. ఇక్కడే వాళ్లంతా ఒక ఎత్తు వేశారు. బిల్లు ఎగవేసే నెపంతో టాయ్‌లెట్‌ వంకతో ఒకరి తరువాత ఒకరు మెల్లిగా పలాయనం చిత్తగించారు.కానీ  వాళ్లు ఎత్తులు పారలేదు.రెస్టారెంట్ నుండి బయటకు వచ్చి, కారులో పారిపోవడానికి ప్రయత్నించారు.  కానీ  ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో  చిక్కక తప్పలేదు. 

చదవండి: ఉత్సాహంగా బరాత్‌, తెల్లారితే పెళ్లి : అంతలోనే విషాదం

ఎలా అంటే..: వీరి వ్యవహారాన్ని ఒక కంట గమనిస్తున్న  హోటల్ యజమాని  వెయిటర్ వాళ్లను వెంబడించారు. గుజరాత్ , రాజస్థాన్ సరిహద్దు  అంబాజీ వైపు కారు వెళ్తున్నట్లు CCTV ఫుటేజ్ లో కనిపించింది. పోలీసుల సహాయంతో, ఐదుగురినీ అక్కడికక్కడే అరెస్టు చేశారు. ఆ తరువాత  తమ స్నేహితుడికి ఫోన్ చేసి బిల్లు చెల్లించడానికి ఆన్‌లైన్‌లో డబ్బును ట్రాన్స్‌ఫర్‌  చేయమని  చెప్పి బిల్లు కట్టారట.
 ఇదీ చదవండి: Severe Cyclone Montha "మోంథా" ముంచుకొస్తోంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement