ఇటీవలికాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో సంభవిస్తున్నమరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా పెళ్లి ఒక రోజు ముందు నవ వధువు గుండెపోటుతో కన్నుమూసింది. దీంతో పెళ్లి బాజాలతో కళకళ లాడాల్సిన వేదిక ఆత్మీయుల రోదనలతో విషాదంగా మారిపోయింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ఈ ఘటన జరిగింది.
ఫరీద్‌కోట్ జిల్లాలోని బర్గారి గ్రామానికి చెందిన పూజకు సమీప గ్రామమైన రౌకేకు చెందిన వ్యక్తితో ఇటీవల నిశ్చితార్థం అయింది. వరుడుదుబాయ్‌లో ఉండటంతో పెళ్లికి ముందు వధూవరులిద్దరూ ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. వీడియో కాల్‌లోనే ఎంగేజ్‌మెంట్ జరిగింది. వివాహానికి కొన్ని రోజుల ముందు వరుడు దుబాయ్ నుండి తిరిగి వచ్చాడు. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లికి సర్వం సిద్ధం చేసుకున్నాయి.
వివాహానికి ఒక రోజు ముందు, జాగో వేడుక (బారాత్) సందర్భంగా, పూజ తన బంధువులతో సంతోషంగా జరుపుకుంది. అయితే, ఆ రాత్రి 2 గంటల ప్రాంతంలో, ఆమె ముక్కు నుండి అకస్మాత్తుగా రక్తం రావడం ప్రారంభమైంది. వెంటనే స్పందించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించాడు. దీంతో పెళ్లి ఇల్లు కాస్త విషాదంగా మారిపోయింది. పూజా అంత్యక్రియల ఊరేగింపు ఆమె పెళ్లి దుస్తులలో ఉండగానే జరిగింది. దీంతో వధూవరుల కుటుంబాలతోపాటు గ్రామం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. ఎంతో సంతోషంగా పెళ్లి చేసి, అత్తారింటికి పంపాలనుకున్నామని బరాత్ రాత్రి పూజకు గుండెపోటు రావడంతోచనిపోయిందని అమ్మాయి తండ్రి, వరుడి సోదరుడు వాపోయారు.


