breaking news
mariage
-
పెళ్లిలో స్కాన్ చదివింపులు
ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. పదో పరకో చదివింపులు జరుగుతూనే ఉంటాయి. దగ్గరివారైతే కొంచెం ఎక్కువ.. దూరపు చుట్టాలైతే చిన్న చిన్న గిఫ్ట్‌లతో పని కానిచ్చేస్తూంటాం. అయితే ఇప్పటివరకూ నగదు, బహుమతులతో సాగుతున్న ఈ చదివింపుల తంతు కేరళలో కొత్త అవతారమెత్తింది. పేటీఎం బాట పట్టింది. ఎలాగంటే.. కేరళలోని ఒకానొక ఊళ్లో ఒక పెళ్లి. బంధుమిత్రుల కోలాహలం, వధూ వరుల అచ్చట్లు ముచ్చట్లు ఎన్ని ఉన్నా.. ఈ వేడుకలో హైలైట్ మాత్రం పెళ్లికూతురి తండ్రి. తెల్లటి షర్టు, పంచెతో కనిపించిన ఈయనగారి జేబుపై పేటీఎం క్యూఆర్ కోడ్ పిన్ చేసి ఉంది మరి. పెళ్లికి కాదుకానీ... మూడేళ్ల క్రితం పంజాబ్, బీహార్లలో శుభకార్యాల్లో బ్యాండ్ వాయించే వారికి డిజిటల్ చదివింపుల చేసిన వాళ్లు ఉన్నారు. డ్రమ్ముకు అతికించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నజరానాలు సమర్పించిన వాళ్లు కొందరైతే.. డ్రమ్ముపైనే క్యూఆర్ కోడ్ ముద్రించుకుని మరీ నగదు ప్రశంసలు పొందిన వారు ఇంకొందరు. దేశంలో 2017లో మొదలైన ‘భారత్ క్యూఆర్’తో డిజిటల్ పేమెంట్లు చాలా సులువైన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ క్యూఆర్ కోడ్ పేమెంట్ వ్యవస్థ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మాస్టర్‌కార్డ్, వీసాలతో మొదలుపెట్టగా.. తరువాతి కాలంలో దీన్ని అందరూ వాడటం మొదలైంది. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటివి మూలమూలలకూ చేరిపోయాయి. గత ఏడాది దేశం మొత్తమ్మీద 35 కోట్లకుపైగా క్యూఆర్ కోడ్లు చెలామణిలో ఉన్నాయంటే ఇదెంత పాప్యులర్ అన్నది ఇట్టే అర్థమై పోతుంది.క్యూఆర్ కోడ్లు పెట్టుకుని భిక్షమెత్తుకునే వారిని మనం చూసే ఉంటాం కానీ ఇలా వెరైటీగా చదివింపుల కోసం క్యూఆర్ కోడ్‌ను తొలిసారి వాడింది మాత్రం ఈయనే కాబోలు!. ‘‘అయ్యలారా.. అమ్మలారా.. కూతురి పెళ్లికి బోలెడంత ఖర్చయిపోయింది... చేసే చదివింపులు ఏవో నాకూ కొంత ముట్టజెబితే... అదో తుత్తి’’ అన్నట్టుగా ఉంది ఆ తండ్రి వ్యవహారం. ఇన్‌స్టాగ్రామ్‌లో తెగవైరల్ అయిపోయింది ఈ వీడియో క్లిప్. కొంతమంది అతిథులు మొబైల్ఫోన్లతో స్కాన్ చేసి పేటీఎం చదివింపులు చేయించడమూ స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో పడిందే తడవు.. పలువురు పలు రకాల కామెంట్లూ చేస్తున్నారు. పెళ్లికూతురి తండ్రికి డిజిటల్ టెక్నాలజీపై ఉన్న మక్కువను, దేశంలో డిజిటల్ చెల్లింపులు సులువైన వైనాన్ని కొంతమంది బాగానే ప్రశంసించారు. మరికొందరు డిజిటల్ టెక్నాలజీ మన సంప్రదాయాలను మరుగున పడేలా చేస్తోందని నొసలు విరిచారు కూడా. ఏదైతేనేం.. ఆ పెళ్లికి వెళ్లిన వారందరూ ఆ తండ్రి చేష్టకు కాసేపు సరదాగా నవ్వుకున్నారు. ఇచ్చేదేదో ‘పే’ చేసేసి.. సుష్టుగా భోంచేసి మరీ వెళ్లిపోయారు. ఆశీర్వాదాలు వధూ వరులకు... క్యాష్ తండ్రికి అన్నమాట! View this post on Instagram A post shared by INDIA ON FEED (@indiaonfeed) -
ఉత్సాహంగా బరాత్, తెల్లారితే పెళ్లి : అంతలోనే విషాదం
ఇటీవలికాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో సంభవిస్తున్నమరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా పెళ్లి ఒక రోజు ముందు నవ వధువు గుండెపోటుతో కన్నుమూసింది. దీంతో పెళ్లి బాజాలతో కళకళ లాడాల్సిన వేదిక ఆత్మీయుల రోదనలతో విషాదంగా మారిపోయింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ఈ ఘటన జరిగింది.ఫరీద్కోట్ జిల్లాలోని బర్గారి గ్రామానికి చెందిన పూజకు సమీప గ్రామమైన రౌకేకు చెందిన వ్యక్తితో ఇటీవల నిశ్చితార్థం అయింది. వరుడుదుబాయ్లో ఉండటంతో పెళ్లికి ముందు వధూవరులిద్దరూ ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. వీడియో కాల్‌లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. వివాహానికి కొన్ని రోజుల ముందు వరుడు దుబాయ్ నుండి తిరిగి వచ్చాడు. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లికి సర్వం సిద్ధం చేసుకున్నాయి. వివాహానికి ఒక రోజు ముందు, జాగో వేడుక (బారాత్) సందర్భంగా, పూజ తన బంధువులతో సంతోషంగా జరుపుకుంది. అయితే, ఆ రాత్రి 2 గంటల ప్రాంతంలో, ఆమె ముక్కు నుండి అకస్మాత్తుగా రక్తం రావడం ప్రారంభమైంది. వెంటనే స్పందించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించాడు. దీంతో పెళ్లి ఇల్లు కాస్త విషాదంగా మారిపోయింది. పూజా అంత్యక్రియల ఊరేగింపు ఆమె పెళ్లి దుస్తులలో ఉండగానే జరిగింది. దీంతో వధూవరుల కుటుంబాలతోపాటు గ్రామం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. ఎంతో సంతోషంగా పెళ్లి చేసి, అత్తారింటికి పంపాలనుకున్నామని బరాత్ రాత్రి పూజకు గుండెపోటు రావడంతోచనిపోయిందని అమ్మాయి తండ్రి, వరుడి సోదరుడు వాపోయారు. -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఎట్టకేలకు తన ప్రేయసి నటాషా దలాల్‌ను వివాహమాడారు. జనవరి 24న(ఆదివారం) ముంబైలోని మాన్సన్ హౌస్ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అతి కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లి ఫోటోలను వరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తాజాగా పెళ్లిలో హల్దీ వేడుకకు చెందిన ఫోటోలను వరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. హల్దీ జరిగింది కదా అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ ఫోటోలో వరుణ్ పసుపు పూసుకొని కండల వీరుడిలా ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. చదవండి: కొన్ని గంటల్లో పెళ్లి.. హీరో కారుకు ప్రమాదం ఇక వరుణ్ ధావన్- నటాషాలకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. నటాషాకు ధావన్ మూడు సార్లు ప్రపోజ్ చేయగా, తను రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఒప్పుకుందట. వరుణ్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే దాకా వీరి ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు. అయితే తరువాత ఇద్దరు కలిసి పార్టీలు, డిన్నర్లకు వెళ్లడంతో కెమెరా కంటికి చిక్కారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. కానీ 2019 వరుణ్ పుట్టినరోజు సందర్భంగా పప్రియురాలితో కలిసిన ఫోటోను షేర్ చేయడంతో అధికారికంగా తేలిపోయింది. కాగా గతేడాదే వీరి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ కరోనా కరోనా వాయిదా పడింది. ఇక వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ బాలీవుడ్లో సీనియర్ దర్శకుడు. ఇటీవల వరుణ్‌తో కూలీ నెం 1 అనే సినిమా తెరకెక్కించారు. చదవండి: భర్త ప్రేమ సందేశం: నిహారిక భావోద్వేగం View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
'పతి' వంచితురాలు.!
పదేళ్లుగా నరకంకడప నగరం నకాష్‌లోని మారెమ్మ గుడి పక్కన నివాసమున్న బంగారు వ్యాపారి గౌస్‌పీర్ 1991లో ముద్దనూరుకు చెందిన గౌసియాను వివాహం చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు కలగలేదనే కారణాన్ని చూపి తనకు పరిచయమైన మరో మహిళను గౌస్‌పీర్ వివాహం చేసుకుని వేరే కాపురం పెట్టాడు. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా అడవిలో వదిలేసినట్లు శిథిలమైన ఇంటిలో వదిలేసి... కుక్కలకు విసిరేసినట్లు ఏదో ఒకటి తెచ్చి అలా వేసి పోతుండడం చూస్తే చనిపోవాలనిపిస్తోందని గౌసియా బోరున విలపిస్తోంది. సాక్షి కడప/అర్బన్ : ఎన్నో ఆశలతో... మరెన్నో ఆకాంక్షలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఆడపడుచుకు అడుగడుగునా అన్యాయమే జరిగింది. పెద్దల సమక్షంలో వివాహం చేసుకుని, జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భర్త పిల్లలు పుట్టలేదనే సాకు చూపి దూరం పెట్టాడు. మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అంతవరకు ఏదో అనుకున్నా.. తొలి భార్యకు మాత్రం నరకం చూపించాడు. పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేని ఓ పాడుబడిన ఇంటిలో ఒంటరిగా వదిలేశాడు. ఇళ్లంతా పెచ్చులూడిపోయి మట్టి వాసన ఒకవైపు.. అక్కడే కాలకృత్యాలతో వస్తున్న దుర్వాసన ఇంకోవైపు.. తాగడానికి మంచినీరు పోసుకునే క్యాన్ సైతం పాచిపట్టి.. కుప్పలు కుప్పలుగా అక్కడే పడి ఉన్న పాత దుస్తుల దుర్గంధం మధ్యకాలం వెళ్లదీస్తున్న ఆ మహిళను చూస్తే ఎవరికైనా అయ్యో.. పాపం అనిపిస్తుంది. కానీ కట్టుకున్న భర్తకు మాత్రం కనికరం కలగలేదు. ఏదో పొద్దున, సాయంత్రం ఒకటో, రెండో ఇడ్లి, కొంచెం అన్నం బయటి నుంచి తెచ్చి ఆమె ముఖాన పడేస్తే సరిపోతుందనుకున్నాడో లేక దిక్కులేకుండా వదిలేస్తే మనో వేదనతో ఆమే తనువు చాలిస్తుందనుకున్నాడో తెలియదుగానీ ఆమె పడుతున్న వేదన మాత్రం అంతా ఇంతా కాదు. పైగా భర్తపై పెంచుకున్న మమకారం కాస్త ప్రస్తుతం మనోవేదనకు దారి తీయడంతో ఆమె కుంగిపోయింది. అందరూ ఉన్నా చెత్తకుప్పను తలపించేలా ఉన్న ఇంటిలో జీవచ్ఛవంలా బతుకు వెళ్లదీస్తోంది. ఆమెను కదిలిస్తే ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెబుతున్న మాటలు విన్నవారంతా అయ్యో..ఎంత అమానుషం.. అంటూ చలించిపోయారు. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినగౌసియా సోదరులు గౌసియా నివాసం వద్దకు వచ్చిన భర్త గౌస్‌పీర్‌ను స్థానికులతోపాటు బాధితురాలి బంధువులు టుటౌన్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీతోపాటు గౌసియా బంధువులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు.విషయాన్ని డీఎస్పీ మాసుంబాషా దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ రుషేంద్రబాబును సాక్షి వివరణ కోరగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, పోలీసు స్టేషన్లో న్యాయం జరగకపోతే జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని బాధితురాలి బంధువులు తెలిపారు. ఇంటిలో నరకం ప్రస్తుతం ఉంటున్న ఇంటిలో గౌసియా నరకం అనుభవిస్తోంది. పాడుబడిన ఆ ఇంటిలోనే అన్నం తినడం, మల విసర్జన, పడుకోవడం అన్నీ అక్కడి పరిసరాల్లోనే. ఇంటి గోడలకు రంధ్రాలు పడి, పెచ్చులూడిపోయి లోపల ఎర్రటి మట్టి కనిపిస్తూ ఎలుకలు సైతం అక్కడే నివాసం చేస్తున్నాయి. ఇంటిని శుభ్రపరిచేవారు లేరు. కుటుంబ సభ్యులనునిలదీసిన జయశ్రీ గౌసియా పడుతున్న వేదన తెలుసుకుని అక్కడికి వచ్చిన మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ బాధితురాలు ఉంటున్న ఇంటికి పక్కనే ఖరీదైన భవంతిలో నివాసముంటున్న గౌస్‌పీర్ తల్లిని, అతని సోదరిని నిలదీశారు. పక్కింటిలోనే∙కోడలు అనాథలా బతుకుతుంటే మీకు పట్టదా? అంటూ ప్రశ్నించారు. దీంతో వాళ్లు తమకు ఏం సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంతకుమునుపు జయశ్రీ ఇంటిలోకి వెళ్లి గౌసియాను పరామర్శించి ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గౌసియాను నరకయాతనకు గురి చేస్తున్న భర్తపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. జైలులో ఉన్న కరుడుగట్టిన ఖైదీలకు కూడా సౌకర్యాలు కల్పిస్తారని, కానీ గౌసియా అత్యంత దుర్భర పరిస్థితిలో జీవనం గడుపుతుండడం చూస్తే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్త, ఆడబిడ్డ పక్కనే ఉన్నా గౌసియాను అమానుష పరిస్థితుల్లో వదిలివేయడం దారుణమని. ఆమెను చంపకుండా చచ్చిపోయేలా చేస్తున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. -
అంగరంగ వైభవంగా అల్లరి నరేష్ వివాహం
-
అంగరంగ వైభవంగా అల్లరి నరేష్ వివాహం
హైదరాబాద్: ప్రముఖ నటుడు అల్లరి నరేష్ ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం సాయంత్రం చెన్నైకి చెందిన విరూపతో ఆయన పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వివాహానికి అతిరథులు విచ్చేశారు. సినీ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.


