పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన బాలీవుడ్‌ హీరో

Viral: Varun Dhawan Shares Inside Pics From Marriage Ceremony - Sakshi

బాలీవుడ్ యంగ్‌ హీరో వ‌రుణ్ ధావ‌న్ ఎట్ట‌కేల‌కు త‌న ప్రేయ‌సి న‌టాషా ద‌లాల్‌ను వివాహమాడారు. జ‌న‌వ‌రి 24న(ఆదివారం) ముంబైలోని మాన్సన్ హౌస్ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అతి కొద్ది మంది స‌న్నిహితులు హాజరయ్యారు. పెళ్లి ఫోటోలను వరుణ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. తాజాగా పెళ్లిలో హల్దీ వేడుకకు చెందిన ఫోటోలను వరుణ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. హల్దీ జరిగింది కదా అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ ఫోటోలో వరుణ్‌ పసుపు పూసుకొని కండల వీరుడిలా ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. చదవండి: కొన్ని గంటల్లో పెళ్లి.. హీరో కారుకు ప్రమాదం

ఇక వ‌రుణ్ ధావ‌న్- న‌టాషాల‌కు చిన్నప్పటి నుంచే ప‌రిచ‌యం ఉంది. నటాషాకు ధావన్‌ మూడు సార్లు ప్ర‌పోజ్ చేయ‌గా, తను రిజెక్ట్ చేసింద‌ట‌. ఆ తర్వాత ఒప్పుకుందట. వరుణ్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే దాకా వీరి ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు. అయితే తరువాత ఇద్దరు కలిసి పార్టీలు, డిన్నర్‌లకు వెళ్లడంతో కెమెరా కంటికి చిక్కారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. కానీ 2019 వరుణ్‌ పుట్టినరోజు సందర్భంగా పప్రియురాలితో కలిసిన ఫోటోను షేర్‌ చేయడంతో అధికారికంగా తేలిపోయింది. కాగా గతేడాదే వీరి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ కరోనా కరోనా వాయిదా పడింది. ఇక వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ బాలీవుడ్‌లో సీనియర్ దర్శకుడు. ఇటీవ‌ల వ‌రుణ్‌తో కూలీ నెం 1 అనే సినిమా తెర‌కెక్కించారు. చదవండి: భర్త ప్రేమ సందేశం: నిహారిక భావోద్వేగం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top