"మోంథా" తుఫాను కోస్తా తీర ప్రాంత వాసులను వణికిస్తోంది. భారీ వర్షాలు, ఈదురుగాలుతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు, ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాను గత 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర- వాయువ్య దిశగా కదిలి, కాకినాడ (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 240 కి.మీ., విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-నైరుతి దిశలో 320 కి.మీ., గోపాల్‌పూర్ (ఒడిశా)కి దక్షిణ-నైరుతి దిశలో 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో అప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ప్రజలు స్వయంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వాతావరణ అధికారుల సూచనలను ఎల్లపుడూ గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఈ నేపథ్యంలో తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
పాటించాల్సిన జాగ్రత్తలు
🚨 Cyclone Alert!
Severe Cyclonic Storm #Montha over west central Bay of Bengal is likely to cross Andhra Pradesh coast between Machilipatnam and Kalingapatnam around Kakinada during evening/night of 28th October, with a maximum sustained wind speed of 90-100 kmph gusting to 110… pic.twitter.com/ZD4WW6ik2k— PIB India (@PIB_India) October 28, 2025
తుఫాను లాంటి పరిస్థితులను నివారించడానికి ఉత్తమ మార్గం ఈ సమయాల్లో ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండటం అవసరం.
ఆఫీసులోనో, బయటో ఉంటే, వర్షం ఆగే వరకు వేచి ఉండాలి.
ఇంట్లో, ఫ్లాష్‌లైట్, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ,ఇతర ఆహార పదార్థాలను దగ్గర్లో ఉంచుకోవాలి
అధికారుల సూచనలను పరిశీలిస్తూ ఉండాలి.
భారీ వర్షాలు, ఈదురు గాలలనుంచి కాపాడుకునేలా ఇంటిలోపలే ఉండాలి. అత్యవసరమైతే తప్ప, కొన్ని జాగ్రత్తలో బయటికి రావాలి.
ఇంటి లోపల కిటికీలకు దూరంగా ఉండాలి.కిటికీలు ,తలుపులను సురక్షితంగా మూసి ఉంచాలి. బలమైన గాలులకు కిటికీలుపడిపోకుండా తగిన జాగ్రత్తలుతీసుకోవాలి. గాజు కిటికీలైతే మరింత అప్రమత్తత అవసరం.
భారీ వర్షాల సమయంలో ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిపివేయాలి.
విద్యుత్ పరికరాలను టీవీ, ఫ్యాన్, ఫ్రిడ్జ్‌లను ఆఫ్ చేయాలి.
అవసరమైన మందులు, నిత్యావసర సరుకులు నిల్వ ఉంచుకోవాలి. -
శిథిల భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా, జాగ్రత్తగా ఉండాలి.
విలువైన పత్రాలు, నగదు భద్రంగా ఉండేలా చూసుకోవాలి.
నిరంతరం అధికారులను సూచలను గమనిస్తూ, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లండి
ఎవరైనా ఆపదలో ఉన్నట్టు గమనిస్తే తమను తాము కాపాడుకుంటే వారిని ఆదుకోడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు జాగ్రత్తగా ఉండాలి.
చలిగాలులనుంచి కాపాడుకునేందుకు వెచ్చని రగ్గులు, స్వెట్లర్లు ధరించాలి. ముఖం , కళ్ళు కప్పి ఉంచుకోవడం చాలా అవసరం.
వాహనంలో ఉంటే, ఎగిరే వస్తువుల ప్రమాదం లేని చోట దానిని పార్క్ చేయండి. తుఫాను సమయంలో వాహనం లోపల రేడియో ప్లే చేయవద్దు; అలా చేయడం వల్ల మీరు మెరుపులకు గురవుతారు.
తుఫాను సమయంలో స్నానం చేయడం మానుకోండి. నీటిలో కరెంట్ వేగంగా వ్యాపిస్తుంది.
(బిగ్‌బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా!)


