ఒక్కసారిగా కూలిపోయిన వంతెన.. ట్రక్కు, కార్లు నదిలో పడిపోయి.. | Gujarat Vadodara Gambhira Bridge Collapsed, Video Viral | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా కూలిపోయిన వంతెన.. ట్రక్కు, కార్లు నదిలో పడిపోయి..

Jul 9 2025 10:41 AM | Updated on Jul 9 2025 12:39 PM

Gujarat Vadodara Gambhira Bridge Collapsed, Video Viral

గాంధీనగర్‌: గుజరాత్‌ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలిపోయింది. ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో దానిపై నడిచే వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. కొందరు ప్రయాణీకులు గల్లంతయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని ఆనంద్ పట్టణం, వడోదరలను కలుపుతూ మహిసాగర్ నదిపై పద్రా వద్ద గంభీర వంతెన ఉంది.  బుధవారం ఉదయం గంభీర వంతెనలోని కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దానిపై వెళ్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే.. సహాయక బృందాలు అక్కడి చేరుకుని నదిలో ఉన్న వారిని రక్షించారు. వాహనాల నుంచి ఇప్పటివరకు నలుగురిని రక్షించారని.. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. 

 

అయితే, వంతెన పాతబడడంతో పాటు.. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూలిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తంచేశారు. వంతెన కూలడంతో ఇరు పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement