20న బీజేపీ జాతీయ  అధ్యక్షుడి ప్రకటన | Announcement of BJP National President Election Schedule | Sakshi
Sakshi News home page

20న బీజేపీ జాతీయ  అధ్యక్షుడి ప్రకటన

Jan 16 2026 3:04 PM | Updated on Jan 17 2026 4:58 AM

Announcement of BJP National President Election Schedule

ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేసిన రిటర్నింగ్‌ అధికారి కె.లక్ష్మణ్‌

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడి పేరును ఈ నెల 20వ తేదీన అధికారికంగా ప్రకటించనుంది. ఈ మేరకు శుక్రవారం ఎన్నిక షెడ్యూల్‌ను పార్టీ జాతీయ రిటర్నింగ్‌ అధికారి, ఎంపీ కె.లక్ష్మణ్‌ శుక్రవారం ప్రకటించారు. ‘సంఘటన్‌ పర్వ్‌–2024’లో భాగంగా దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ మార్గ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఈనెల 19న నామినేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది.

 20వ తేదీన ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఓటింగ్‌ జరుగుతుంది. అదే రోజు అధికారికంగా ఫలితాన్ని ప్రకటించడం లేదా అవసరమైతే ఓటింగ్‌ నిర్వహిస్తామన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షుడిగాను బాధ్యతల్లో ఉన్నారు. ఈయన స్థానంలో ఇటీవలే బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్‌ నబీన్‌ పార్టీ కొత్త బాస్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అవకాశముందని చెబుతు న్నారు. ఈ పదవి రేసులో మరొకరు ఉండేందుకు దాదాపు అవకాశాలు లేవంటున్నారు.
 

ఈనెల 19న మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement