19న నామినేషన్.. 20న అధికారిక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో కీలక మార్పునకు ముహూర్తం ఖరారైంది. ఇటీవలే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నబీన్ సిన్హా నూతన అధ్యక్షుడి పదవి కోసం ఈ నెల 19న నామినేషన్ వేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదకుడిగా నామినేషన్ కార్యక్రమంలో హాజరయ్యే అవకాశముంది. బీజేపీ అంతర్గత వ్యవస్థలో భాగంగా జరిగే ఈ ఎన్నిక ప్రక్రియ పార్టీ క్యాలెండర్‌లో హైప్రొఫైల్ ఈవెంట్‌గా మారనుంది.
ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్ నేతలు, పార్టీలో కేంద్ర సభ్యులు, ముఖ్య పదాధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన మరునాడే 20వ తేదీన బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించను న్నారు. ఈ ప్రకటనతో పార్టీ నాయకత్వ నిర్మాణంపై స్పష్టత రావడమే కాకుండా, రాబోయే ఎన్నికల సవాళ్లను దృష్టిలో ఉంచుకుని జాతీయ స్థాయిలో సంస్థాగత వ్యూహానికి బలమిచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. బిహార్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నితిన్ నబీన్‌ను డిసెంబర్ 14న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు.


