యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 9వ వార్డులో బీజేపీ తరఫున పోటీ చేసిన బొమ్మగాని రాజమణి ఓటమి పాలయ్యారు. ప్రచారంలో భాగంగా దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నానని, ఒక్క అవకాశం ఇవ్వాలని కన్నీళ్లు పెడుతూ యువతను ఓటు వేయాలని వేడుకుంది. అయితే ఆమెకు 10 ఓట్లు మాత్రమే వచ్చాయి.
మూడే ఓట్లు.. అయినా తగ్గేదేలె..

జనగామ: జనగామ మున్సిపాలిటీలోని 27వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన అనంతుల డు ఓట్లు మాత్ర మే వచ్చాయి. అయినా మూడు వేళ్లతో చూపిస్తూ చిరునవ్వు చిందించారు.
కల్నల్ తల్లి ఓటమి 
సూర్యాపేట: భారత్–చైనా సరిహద్దులో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోశ్‌బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 44వ వార్డు నుంచి బీఆర్‌ఎస్
అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయారు.


