బ్యాలెట్‌ బాక్స్‌లో లేఖ, చీటీ | Telangana Voters Use Ballot Boxes to Voice Protest Over Pending Compensation and Pensions | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ బాక్స్‌లో లేఖ, చీటీ

Feb 14 2026 7:35 AM | Updated on Feb 14 2026 7:35 AM

సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీలోని ఓటర్లు తమ డిమాండ్లను బ్యాలెట్‌ బాక్సుల్లో వేశారు. పాత జాతీయ రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోయిన తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ 48వ వార్డుకు చెందిన 50 మంది ఓటర్లు బ్యాలెట్‌ బాక్సుల్లో చిట్టీలను రాసి వేసి తమ డిమాండ్లను అధికారుల ముందు ఉంచారు.  

∙తమకు న్యాయంగా రావాల్సిన రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలంటూ 45వ వార్డుకు చెందిన పెన్షనర్లు బ్యాలెట్‌ బాక్సులో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి విన్నవిస్తూ లేఖ రాశారు. తాము రిటైరై 15 నెలలు గడిచిందని, ఒక్క పైసా కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

∙లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని 14వ వార్డుకు చెందిన ఓ రిటైర్డు ఉద్యోగి   తన కు రావాల్సిన రిటైర్‌మెంట్‌ డబ్బులు రాలేదని, అందుకు కారణం కాంగ్రెస్‌ ప్రభుత్వమని,  సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రి వర్గం తగిన మూల్యం చెల్లించక తప్ప దని బ్యాలెట్‌ బాక్స్‌లో వేసిన లేఖలో   పేర్కొన్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement