హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసుల తప్పం ఏం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు. ఇక్కడ జరిగేది ఓన్లీ యాక్టింగ్ మాత్రమేనని, నో యాక్షన్ అంటూ చమత్కరించారు. ఇద్దరూ దోస్తులు కాబట్టి నటిస్తున్నారని,. బ్రేవరీస్ గతంలో వాళ్లు ఇచ్చినవే కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారన్నారు.
‘ రెండు పార్టీలు కలిసి ప్రజలతో ఆడుకుంటున్నారు. సిట్‌లతో పనికాదు. నోటుకు ఓటు కేసులో రేవంత్‌ను బీఆర్‌ఎస్ కాపాడింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ను కాపాడుతున్నారు. రెండు పార్టీల మధ్య క్విడ్ ప్రో నడుస్తుంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్ణయాలపై జుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. అన్ని నిర్ణయాలపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నం.
సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ప్రభుత్వ నిర్ణయాలపై దర్యాప్తు జరగాలి. ఇక్కడ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందూ దొందే. నోటీసులు ఇస్తున్నారు తప్ప నేతలను అరెస్టు చేయడం లేదు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలి’ అని పేర్కొన్నారు.


